Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నేను నిప్పును ఏతప్పూ చేయలేదు … పదవికన్నా ఆత్మగౌరమే ముఖ్యం :ఈటెల

నేను నిప్పును ఏతప్పూ చేయలేదుపదవికన్నా ఆత్మగౌరమే ముఖ్యం ; ఈటెల
నేను పదవిని గడ్డిపోచతో పోల్చను
ఆత్మగౌరంకంటే నాకు ఏది ముఖ్యం కాదు
కొన్ని ఛానళ్లు ముందస్తు ప్రణాళికతో తనపై తప్పుడు ప్రచారం చేశాయి
హాచరీస్ కోసం అసైన్డ్ భూమిని తీసుకున్నాం
దానికి సంబంధించిన పత్రాలు ఎమ్మార్వో వద్దే ఉన్నాయి
స్కూటర్ పై తిరిగిన వ్యక్తి వందల కోట్లకు ఎలా పడగలెత్తాడు?
భూములు పోయినా పర్వాలేదు.. ఆత్మగౌరవాన్ని చంపుకోలేను
అన్ని ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో సహా అన్ని విచారణ సంస్థలతో విచారణ జరిపించాలి
తప్పు చేసినట్టు తేలితే శిక్షకైనా సిద్ధమే

తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై మంత్రి ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. ఛానళ్లలో వస్తున్నా వార్తలపై ఆయన బరువెక్కిన హృదయంతో తన అభిప్రాయాలను వెల్లడించారు. తనపై భూకబ్జా ఆరోపణలు కావాలనే జరుగుతున్నా ప్రచారంగా అభిప్రాయపడ్డారు . కొన్ని చానళ్ళు ముందస్తు ప్రణాళికతోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆవేదనాభరితంగా చెప్పారు.నేను ఎక్కడ తప్పుచేయలేదు. నేను ఏతప్పూ చేయలేదు … నాకు పదవికన్న ఆత్మాభిమానమే ముఖ్యం .పదవిని గడ్డిపోచతో పోల్చాను .తనభూములు ,పదవిపోవున భాదపడనని ఆవేదన భరితంగా అన్నారు. నాకు హేచరీస్ ఉన్న మాట నిజం దానికోసం 100 కోట్ల అప్పు తీసుకున్నాను . నా కొడుకు చదువుకుని వచ్చిన తరువాత వ్యాపారంలోకి వచ్చారు. వల్లే నా హేచరీస్ చూసుకుంటున్నారు. నాకు 2004 కంటే ముందే 120 ఎకరాల భూమిఉంది. కోళ్ల ఫారం ఉంది .అందులో 10 లక్షల కోళ్లు ఉంటాయి. కేసీఆర్ నియోజకవర్గంలో కూడా నాకు కోళ్ల ఫారం ఉండేది దాన్ని అమ్మేశాము .ఏనాడూ తప్పుడు పని చేయలేదు.అందుకు ఎవరిని అనుమతించలేదు . నా స్వభావరీత్యా కూడా చెడ్డపనులు అంగకరించనని అన్నారు. తాను ముదిరాజ్ కులంలో పుట్టానని తనది భయపడే జాతి కాదని ,చిల్లర మాటలకూ భయపడనని అన్నారు
తెలంగాణ ప్రజల హృదయాల్లో తాను ప్రేమను, గౌరవాన్ని సంపాదించుకున్న తనను కొన్ని టీవీ ఛానళ్లు కట్టుకథలు అల్లుతూ వార్తలను ప్రసారం చేశాయని అన్నారు. ఇది దుర్మార్గమైనదని, అసహ్యకరమైనదని చెప్పారు. ముందస్తు ప్రణాళికతో ఈ వార్తలను ప్రసారం చేశారని దుయ్యబట్టారు. అంతిమ విజయం ధర్మానిదేనని తెలిపారు. తాత్కాలికంగా న్యాయం అపజయం పొందవచ్చని వ్యాఖ్యానించారు.

2016లో ఒక పెద్ద హ్యాచరీ పెట్టాలని తాను అనుకున్నానని… చదువుకుని వచ్చిన తన కుమారుడిని కూడా తమ వ్యాపారంలో కొనసాగించాలని జమునా హ్యాచరీస్ ను ప్రారంభించానని చెప్పారు. హ్యాచరీస్ కోసం 40 ఎకరాల భూమిని కొన్నామని వెల్లడించారు. దీనికోసం బ్యాంకు నుంచి రూ. 100 కోట్ల లోన్లు కూడా తీసుకున్నానని తెలిపారు. హ్యాచరీస్ కు చుట్టుపక్కల అసైన్డ్ భూములున్నాయని, అవి ఎందుకూ పనికి రాని భూములు అని చెప్పారు. ఆ భూములను తీసుకొమ్మని రైతులు కోరితే ఎవరూ ఆ భూములను కొన కూడదు.. మీరే ఆ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేయమని చెప్పానని, దానికి సంబంధించిన పత్రాలు ఎమ్మార్వో వద్దే ఉన్నాయి అని చెప్పారు. 2004లోనే తన కోళ్ల ఫారాలలో దాదాపు 10 లక్షల కోళ్లు ఉండేవని ఈటల తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజవర్గంలో కూడా లక్ష కోళ్లు ఉండే ఫారం ఉండేదని… దాన్ని అమ్మేశానని చెప్పారు. 2004కు ముందే తనకు 120 ఎకరాలకు పైగా భూమి ఉందని తెలిపారు. జమున హాచరీస్ కోసం రైతుల దగ్గర నుంచి తాను ఒక్క ఎకరా భూమిని కూడా లాక్కోలేదని… వారే తన వద్దకు వచ్చి భూమిని అప్పజెప్పారని అన్నారు. తాను ఆత్మను అమ్ముకునే మనిషిని కాదని చెప్పారు. ఆత్మగౌరవాన్ని, ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తినని తెలిపారు. తన ఇంట్లో ఎప్పుడూ పొయ్యి వెలిగే ఉంటుందని… లక్షల మంది ఇక్కడ భోంజేశారని… అన్నం పెట్టకుండా ఎవరినీ పంపించమని చెప్పారు.

తన హాచరీస్ కోసం రైతుల వద్ద నుంచి తీసుకున్న భూముల పత్రాలు ఇప్పటికీ ఎమ్మార్వో దగ్గరే ఉన్నాయని ఈటల తెలిపారు. వాటిని చూపించడానికి తాను సిద్ధమని చెప్పారు. ధర్మం లేకపోతే వ్యాపారంలో తాను వంద కోట్లకు ఎదిగేవాడిని కాదని అన్నారు. తన జీవితంలో ఒకరి ఆస్తిని కూడా లాక్కోలేదని, ఒకరిని కూడా ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. తనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో కరీంనగర్ ప్రజలకు తెలుసని అన్నారు. తన భూములు పోయినా పర్వాలేదని… ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకోనని చెప్పారు. తాను ముదిరాజ్ కులంలో పుట్టానని… తనది భయపడే జాతి కాదని ఈటల అన్నారు. చిల్లరమల్లర మాటలకు తాను భయపడనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాత్రికి రాత్రే ఎందరో కోట్లకు పడగలెత్తారని, స్కూటర్ వేసుకుని తిరిగిన వ్యక్తి వందల కోట్లకు ఎలా పడగలెత్తారని ఈటల ప్రశ్నంచారు. తనకు అందరి చరిత్రలు తెలుసని, అయితే ఎవరి పేర్లను తాను బయటపెట్టదలుచుకోలేదని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమకారులను కడుపులో పెట్టుకుని చూసుకున్న చరిత్ర తనదని చెప్పారు.

తనపై వచ్చిన ఆరోపణలపై అన్ని విచారణ సంస్థలతో పాటు, సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన ఆస్తులపై కూడా విచారణ జరిపించాలని అన్నారు. తాను తప్పు చేసినట్టు ఒక్క విచారణలో తేలినా… ఏ శిక్షకైనా సిద్ధమేనని తెలిపారు.

Related posts

అందరి చూపు హుజురాబాద్ వైపే …..

Drukpadam

మంత్రి పదవిని ఆశించడంలో తప్పులేదుగా!: తమ్మినేని సీతారాం!

Drukpadam

షర్మిల ఎంట్రీతో ఉలిక్కి పడ్డ రాజకీయ పార్టీలు

Drukpadam

Leave a Comment