Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల తరుపున మీ గొంతుకనై ప్రశ్నిస్తా…మంద కృష్ణమాదిగ!

జర్నలిస్టుల తరుపున మీ గొంతుకనై ప్రశ్నిస్తా…మంద కృష్ణమాదిగ!
-ముఖ్యమంత్రి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
-ఇల్లు ,ఇళ్లస్థలాలు , అక్క్రిడేషన్ కార్డులు , హెల్త్ కార్డులు అర్హులైన జర్నలిస్టులకు అందజేయాలి …
-సమాచారశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలి
-జర్నలిస్టుల సమస్యల పరిస్కారం కోసం రాష్ట్రస్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం ..
-అందుకు అన్ని జర్నలిస్టు సంఘాలను, రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తాం…
-2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి…
-ఎమ్మెస్ పి ,ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల శక్తిని అంతా ఉపయోగిస్తాం.
-జర్నలిస్టులకు జర్నలిస్ట్ బంద్ పధకం ప్రవేశ పెట్టాలి
-దళిత బంద్ లో దళిత జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి
-జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తాం
-ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మంద కృష్ణ మాదిగ

తెలంగాణ ఉద్యమంలో అత్యంత త్యాగపూరితమైన పాత్రను పోషించిన పాత్రికేయుల సంక్షేమాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం శోచనీయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు .మంగళవారం ఖమ్మం వచ్చిన ఆయన ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సమాజంలో నాల్గొవ స్తంభంగా చెప్పబడుతున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కరంలో కేసీఆర్ ప్రభుత్వం చూపుతున్న అలసత్వంపై ఆయన తీవ్రంగా స్పందించారు .అనేక వ్యవప్రయాసలకోర్చి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో జర్నలిస్టుల పాత్ర తెలిసిన కేసీఆర్ వారిపై సవతితల్లి ప్రేమ చూపించడం దారుణమని అన్నారు . ఇప్పటికైనా వారి సమస్యలను సానుకూల వైఖరితో ఆలోచించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు . లేకపోతె వారి పక్షాన పౌరసమాజాన్ని , రాజకీయపార్టీలు , జర్నలిస్ట్ సంఘాలని ఐక్యం చేసి తాను జర్నలిస్టుల గొంతుకనై ప్రభుత్వాన్ని నిలదీస్తానని పేర్కొన్నారు.

2014 ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జర్నలిస్టు సమాజం కోసం మిగిలిన సమాజమంతా గొంతు కలిపేలా అందరినీ కదిలిస్తానని మందకృష్ణ పేర్కొన్నారు. ఇందుకోసం మొదటగా రాష్ట్రవ్యాప్తంగా ప్రెస్ మీట్ లు , రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను , సంఘాలను కలుపుకొని నేరుగా ముఖ్యమంత్రినే నిలదీస్తామని ఆయన అన్నారు.

రైతుబంధు మిషన్ భగీరథ తదితర పథకాలు దేశానికే ఆదర్శమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం అమలు జరుపుతున్న పథకాలు కూడా దేశానికి ఆదర్శమని చెప్పుకునే స్థాయిలో ఎందుకు లేవని ప్రశ్నించారు.
జర్నలిస్టుల సంక్షేమంలో దక్షిణాదిలోని మెజారిటీ రాష్ట్రాలు ముందున్నాయని తెలంగాణ మాత్రమే వెనకబడిపోయిందని ఆయన పేర్కొన్నారు.

తమిళనాడు, కేరళ, కర్ణాటక , ఒరిస్సా రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పింఛన్ ఇస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సాధనలో లాఠీ దెబ్బలు తగిలి వీపులు పగిలిన , కెమెరాలు ధ్వంసం అయినా , యాజమాన్యాలు ఒత్తిళ్లు గురిచేసిన, వెనకడుగు వేయకుండా తెలంగాణ పోరాటంలో వీరోచిత పాత్ర పోషించిన పాత్రికేయులకు కనీసం ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకు వేయకపోవడం విచారకరమన్నారు .
జర్నలిస్టుల త్యాగాలు రాష్ట్ర సాధనలో వారి పాత్ర గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కి అందరికంటే ఎక్కువగా తెలుసునని అయినప్పటికీ సవతితల్లి ప్రేమ ప్రదర్శించడం సరికాదని అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ తలుచుకుంటే జర్నలిస్టుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శంగా నిలిచే విధంగా చేయగలరని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను జనవరి 2023 కు ముందు కెసిఆర్ అమలు చేయాలని ,లేని పక్షంలో జర్నలిస్టుల పక్షాన తాము పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. జర్నలిస్టు బందు పథకాన్ని జర్నలిస్టుల్లోని పేదలతో పాటు కొద్దిమంది ధనికులకు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. రైతు బంధు పథకం ద్వారా భూస్వాములు పారిశ్రామికవేత్తలు బడా వ్యాపారులకు సైతం రైతుబంధు పథకం కింద కోట్లాది రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం కొద్దిమంది జర్నలిస్టులకు ఇస్తే నష్టమేమీ లేదని మంద కృష్ణ అన్నారు . సమాజంలో అనేక అసమానతలపై పోరాటాలు చేసిన తాను సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టు సమాజం కోసం మిగిలిన సమాజాన్ని జాగృతం చేసి పోరాటం చేస్తామని ప్రకటించారు.

వచ్చే ఫిబ్రవరి 23న మహాజన జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర మహాసభ హైదరాబాదులో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు మందకృష్ణ తెలిపారు. ఆ మహాసభలకు అన్ని సంఘాలను ఆహ్వానించి ఐక్య పోరాటానికి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. పాత్రికేయుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జర్నలిస్టు సంఘ నాయకులు చెరుకుపల్లి శ్రీనివాస్ అమరవరపు కోటేశ్వరరావు కనుకు వెంకటేశ్వర్లు దేవా పాల్గొన్నారు.

జనరల్ లిస్ట్ ల పక్షాన ఆందో కార్యాచరణ ప్రకటించేందుకు ఖమ్మం వచ్చిన మందకృష్ణ కృష్ణ ను టి యు డబ్ల్యూ జే ఐ జేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రామనారాయణ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు ఏనుగు వెంకటేశ్వరరావు ఎలక్ట్రానిక్ మీడియా ఐజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్ కనకం సైదులు జర్నలిస్టు సంఘం రాష్ట్ర నాయకులు నేర్వనేని వెంకట్రావు, నగర అధ్యక్షులు మైసా పాపారావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాటేటి వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు మొహిద్దిన్ , ఐజేయూ లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా జర్నలిస్టు సమస్యలపై రామ్ నారాయణను పలు అంశాలు మందకృష్ణ అడిగి తెలుసుకున్నారు.

 

Related posts

సీఎం జగన్ సతీమణి భారతిపై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు..

Drukpadam

నిరాహారదీక్షకు దిగిన కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు

Ram Narayana

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇక చెప్పేదేమీ లేదు….కేంద్రం !

Drukpadam

Leave a Comment