ఈటలపై కక్ష్య సాధింపే …ఉద్యమకారులు ఐక్యం కావాలి -కోదండరాం
-మంత్రుల ,ఎమ్మెల్యేల కబ్జాలపై సమగ్ర విచారణ జరపాలి
-కేసీఆర్ ఆగడాలకు కు వ్యతిరేకంగా ఐక్యంకావాలి …దుర్మార్గం ఎండగట్టాలి
-ఆత్మాభిమానం ఉన్న ఉద్యమకారులందరు ముందుకు రావాలి
-అనేక మంది త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు
-2018 నుంచే ఈటలను టార్గట్ చేశారు
-పార్టీకి అందర ఓనర్లమే కాని కిరాయిదారులం కాదన్నందుకే ఆయనపై పగపట్టారు
ఈటలపై కేసీఆర్ తీసుకున్న చర్య ముమ్మాటికీ కక్ష్య సాధింపే . ఆయనకు ఉద్యమకారులంటే నచ్చదు . అందుకే ఈటలపై భూకబ్జా పేరుతొ చర్యలకు ఉపక్రమించారని తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఈటల వ్యవహారం ఆయనపై చర్యలకు ఉపకార్మిస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసీఆర్ చర్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . తనపై వచ్చిన ఆరోపణల కు ఆయనకూడా ఏ విచారణ జరిపిన అభ్యతంరం లేదని చెప్పారు. అందులో తప్పులు జరిగితే చర్యలు తీసుకునేందుకు తమకు ఏ అలంటి అభ్యతరం లేదని అదే సందర్భంలో మంత్రులపై ,టీఆర్ యస్ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదని కోదండరాం ప్రశ్నించారు .కేటీఆర్ భూములు ఆక్రమించాయి ఫామ్ హౌస్ కట్టి దానికి రోడ్ వేశాడని వచ్చిన ఆరోపణలపై ఎందుకు విచారణ జరపలేదని అన్నారు. తనకు నచ్చితే ఒకరకంగా నచ్చకపోతే మరోరకంగా వ్యవహరించటం కేసీఆర్ నైజమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు . ఈటలపైనే కాకుండా ఉద్యమంలో పాల్గొన్న అనేకమందిపై కేసీఆర్ ఇదే విధంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అందువల్ల ఉద్యమకారులు ఐక్యం కావలిసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.అందుకు తాము చొరవ తీసుకుంటామని పేర్కొన్నారు. ఉద్యమంలో క్రయశీలకంగా ,చిత్తశుద్ధితో పని చేసిన వాళ్ళను పక్క పెట్టడం మొదటి నుంచి కేసీఆర్ చేస్తున్నదేనని అన్నారు. అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఇప్పడు కొందరి చేతులో బందీ అయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆగడాలకు వ్యతిరేకంగా అందరం ఐక్యం కావాలని ఆయన దుర్మార్గాలను ఎండగట్టాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రం లో చాల భూములు ఆక్రమణలకు గురైయ్యాయని వాటిపై విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. హైద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న నిజాం భూములు , నవాబుల భూములు కబ్జాకు గురైయ్యాయని మియాపూర్ ,హఫీజ్ పేట ,పుప్పాల ,ఎన్ కన్వెన్షన్ భూములపై కూడా దర్యాప్తు జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1994 అప్పటి ప్రభుత్వం హకీమ్ పేటలో ఇచ్చిన 2 వేల ఎకరాల భూములను వెలికి తీసి పేదలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూరికార్డల ప్రక్షాళన జరిగిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం భూవివాదాలు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. ముసాయి పేట , హకీంపేట , పాపన్నపేట , నార్స్సింగ్ మండలాలకు సంబందించిన దున్నుకుంటున్న పేదలకు పట్టాలు ఇవ్వలేదని ,అవి పాత యజమానులు పేరుతోనే ఉన్న విషయాన్నీ ఆయన ప్రస్తహించారు. ఈటల ఎపిసోడ్ లో కొన్ని చానళ్ళు అదే పనిగా పనిగట్టుకొని ప్రచారం చేశాయని దీనిలో అంతరార్థం చెప్పలేదని తప్పుపట్టారు. తమదారికి వస్తే ఒకరంగా ,రాకపోతే మరో రకంగా అణగదొక్కేందుకు కేసీఆర్ దుర్మార్గపు చర్యలకు పూనుకుంటారని కోదండరాం ఘాటుగా స్పందించారు. అందులో భాగంగానే ఈటలపై ఆఘమేఘాలమీద విచారణకు ఆదేశించారని అన్నారు. తన మంత్రి వర్గంలో ఉన్న అనేక మంది మంత్రులపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు విచారణ చేపట్టలేదని అన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ,ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలపై వచ్చిన ఆరోపణలను ఆయన ప్రస్తావించారు.మీడియా సమావేశంలో ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
previous post