Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల కలయిక వ్యాఖ్యలపై తెలంగాణ నేతల మండిపాటు !

సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి: షర్మిల!

  • ఉమ్మడి రాష్ట్రం కోరుకుంటున్నామన్న సజ్జల
  • సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన షర్మిల
  • రెండు రాష్ట్రాలూ కలవడం అసాధ్యమని స్పష్టీకరణ
  • విడిపోయిన రాష్ట్రాలను ఎలా కలుపుతారంటూ ట్వీట్

రాష్ట్ర విభజన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు స్పందించారు. సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివని పేర్కొన్నారు.

నేడు తెలంగాణ ఒక వాస్తవం అని, ఎంతోమంది బలిదానాలు, ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. రెండు రాష్ట్రాలూ కలవడం అసాధ్యం అని షర్మిల స్పష్టం చేశారు. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి… విభజిత రాష్ట్రాలను మళ్లీ ఎలా కలుపుతారు? అని ప్రశ్నించారు.

“మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు. మీ ప్రాంత అభివృద్ధి మీద ధ్యాస పెట్టాలి. మీ హక్కుల కోసం పోరాటం చేయండి, మీ ప్రాంతానికి న్యాయం చేయండి. అంతేకానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మీకు తగదు” అని సజ్జలకు హితవు పలికారు.

కలిసి ఉండడం అనేది కల్ల: సజ్జల వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ కౌంటర్!

Ponnam Prabhakar counters Sajjala comments

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కోరుకుంటున్నామని చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. రెండు రాష్ట్రాలు మళ్లీ కలవడం అనే అంశానికి తావు లేదని స్పష్టం చేశారు. పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం జరిగిందని అన్నారు.

“దీనిపై సుప్రీం కోర్టులో కేసు ఉండొచ్చు, ఇంకేవైనా న్యాయపరమైన అంశాలు జరుగుతుండొచ్చు… కానీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలు ఏర్పడి, రెండు ప్రభుత్వాలు ఎన్నికైనప్పుడు మళ్లీ ఉమ్మడి రాష్ట్రం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణపై మరోసారి దాడికి కుట్రగానే భావించాల్సి ఉంటుంది.

ఆంధ్రా బాగుండాలి, తెలంగాణ బాగుండాలి అని కోరుకోవాలి. కానీ వైసీపీ ఉమ్మడి రాష్ట్రం అంటోందంటే, తెలంగాణపై మళ్లీ రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తోందనే అర్థం. అమరవీరుల ఆకాంక్షలకు, వారి ప్రాణత్యాగాలకు అనుగుణంగా, అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రెండు రాష్ట్రాలు సోదరభావంతో అభివృద్ధి పథంలో పయనించాలని కోరుకోవాలే తప్ప, మళ్లీ కలిసుండాలనే అంశానికి ఎక్కడా తావివ్వకూడదు.

నాడు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాకు ఏం కావాలంటే ఏమీ చెప్పకుండా ఇదే విధంగా వ్యవహరించారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుని, వికేంద్రీకరణ అంటూ ముందుకు వెళుతున్నారు. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ఉండొచ్చు, మళ్లీ కొత్త ప్రభుత్వాలు రావొచ్చు.

ఏదేమైనా రాష్ట్ర విభజన అనేది ముగిసిన అంశం. కానీ మళ్లీ రెండు రాష్ట్రాలు కలవాలంటూ మాట్లాడడం అంటే కొత్త వివాదాలు రేకెత్తించడం, రాజకీయ లబ్ది పొందడం కోసమేనని భావించాల్సి ఉంటుంది” అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Related posts

తన ఇంటిపై జరిగిన దాడి గురించి పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి!

Drukpadam

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’: ప్రకటించిన రేవంత్‌రెడ్డి!

Drukpadam

తాను బీకాం చదవలేదని అశోక్ బాబు స్వయంగా చెప్పారు: విజయసాయిరెడ్డి

Drukpadam

Leave a Comment