వచ్చే ఎన్నికల్లో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ !
-విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానంటున్న లక్ష్మీనారాయణ
-తన భావాలకు మద్దతుగా ఉండే పార్టీతో ఉంటానన్నమాజీ జేడీ
-ఏపీ, తెలంగాణ మళ్లీ కలిస్తే మంచిదేనని వెల్లడి
-రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందని వ్యాఖ్య
సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తిరిగి ఎన్నికల్లో పోటీచేయాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు .అయితే ఏపార్టీ నుంచి పోటీచేస్తారని విషయం మాత్రం చెప్పలేదు ..తన భావాలకు మద్దతుగా ఉండే పార్టీతో ఉంటానన్న లక్ష్మీనారాయణ ఏపార్టీతో అనేది ప్రకటించినప్పటికీ ఆయన తిరిగి సొంతగూటికి వెళతారని ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి జనసేన అభ్యర్థిగా లోకసభకు పోటీచేశారు . అక్కడ ఓటమి పాలైన ఆయన జనసేనకు గుడ్ బై చెప్పారు . అయితే ప్రజల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు . తాను రాజకీయాల పై ఆసక్తి చూపుతున్నారు . తిరిగి పోటీచేయాలనే తలంపుతో పావులు కదుపుతున్నారు అందులో భాగంగానే …ఆయన అడుగులు వేస్తున్నారు .
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు సంబంధించి తన ఆలోచనను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని తెలిపారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయంపై సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోందని చెప్పారు. తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు. తన భావాలను స్పష్టంగా చెప్పగలిగే వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది. అయితే ఆయన ఎంచుకునే పార్టీ ఆయన్ను చట్టసభకు పంపగలుగుతుందా ? లేదా ? అనేది చూడాలి…