Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం పురపోరు -నేడే కౌంటింగ్ -గులాబీదే పీఠం

ఖమ్మం పురపోరు నేడే కౌంటింగ్ -గులాబీదే పీఠం
-ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
-10 కౌంటింగ్ హాల్స్ … రెండుగంటల్లో మొదటి ఫలితం
-ఆ తరువాత స్పీడ్ అందుకోనున్న ఫలితాలు

ఖమ్మం పురపోరు కౌంటింగ్ కు సిద్ధమైంది. అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మధ్య జరుగుతున్నా ఈ కౌంటిగ్ కోసం ఎస్ ఆర్ అండి బి జి ఎన్ ఆర్ కళాశాల సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ దగ్గర ఉండి ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా మహమ్మారి నిబంధనల నేపథ్యంలో కౌంటింగ్ కు వచ్చే అధికారులకు , ఏజంట్లకు కరోనా పరీక్షలు తప్పని సరి చేశారు.మాస్క్ ,శానిటైజర్స్ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో టీఆర్ యస్ , సిపిఐ ఒకపక్క , కాంగ్రెస్, సిపిఎం కూటమి మరో పక్క పోరు జరిగింది. బీజేపీ ,జనసేన మరో కూటమిగా ఉన్నాయి. అయితే అధికార పార్టీకే అన్ని అనుకూల అంశాలుగా ఉన్నాయి. ఒక డివిజన్లో ఏకగ్రీవంగా టీఆర్ యస్ గెలవగా మరో డివిజన్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన అభ్యర్థి టీఆర్ యస్ లో చేరారు. దీనితో ఇక్కడ పోటీ నామమాత్రంగా మారింది. అందువల్ల కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ ,సిపిఎం గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కార్పొరేషన్ పీఠం గులాబీ ఖాతాలోనే పడనుంది . ఈ సారి మేయర్ జనరల్ మహిళలు కేటాయించటంతో ఆ పీఠం మీద ఎవరు కూర్చుంటారు ,మంత్రి మదిలో ఎవరు ఉన్నారు, అనేది ఆశక్తిగా మారింది.

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లేకింపుకు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు ….

పోటీలో మొత్తం అభ్యర్థుల  251 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందుకోసం 10 కౌంటింగ్ హాల్స్  ను ఏర్పాటు చేశారు. ప్రతి హాల్‌లో కౌంటింగ్ టేబుల్స్    3 ఉంటాయి .కౌంటింగ్ సూపర్‌వైజర్లు 50
కౌంటింగ్ అసిస్టెంట్ సూపర్‌వైజర్లు 100 మంది ఉంటారు .జోనల్ ఆఫీసర్లను స్ట్రాంగ్ రూమ్ ఇన్-ఛార్జీలుగా కూడా నియమించారు.10 హాల్స్ లో 10 మందినీ రో ఇన్-ఛార్జీలుగా మరియు డ్రమ్ ఇన్-ఛార్జ్ లుగా నియమించారు.ప్రతి టేబుల్ కు కౌంటింగ్ సిబ్బంది ఉంటారు .
i)  RO టేబుల్ కి -03 (RO, ARO & కంప్యూటర్ ఆపరేటర్)

ii)  కౌంటింగ్ టేబుల్ కి -03( ఒక సూపర్‌వైజర్ & ఇద్దరు అసిస్టెంట్ సూపర్‌వైజర్)

*RO హాల్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు

*ప్రతి హాల్ కి క్షుణ్నంగా పరిశీలించిడానికి(MO) ఒకరిని  నియమించరు. అలా 10 హాల్ లకు 10 మందిని నియమించారు. (మైక్రో అబ్జర్వర్ MO)

*స్ట్రాంగ్ రూమ్‌  బయట 10 సిసి కెమెరాలు  మరియు  కౌంటింగ్ హాల్ లోపల 10 మంది వీడియోగ్రాఫర్‌లను ఏర్పాటు చేస్తారు.

TSEC యొక్క మార్గదర్శకాల ప్రకారం, కౌంటింగ్ హాల్స్‌లో కోవిడ్ నిబంధనలు  పాటిస్తున్నారు.
టిఎస్‌ఇసి సూచనల మేరకు కౌంటింగ్ సిబ్బంది, సూపర్‌వైజర్లు మరియు ఏజెంట్లు మరియు  పోలీసు సిబ్బందికి కోవిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చిన వారిని  మాత్రమే అనుమతిస్తారు .

 

Related posts

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం…

Drukpadam

తన కుమారుడ్ని ఎక్కడికి తరలించారంటూ డీజీపీని ప్రశ్నించిన సీఎం కేసీఆర్ అన్న కుమార్తె!

Drukpadam

అమెరికా చట్ట సభలో కొత్త బిల్లుతో భారతీయులకు మరింత ఊరట!

Drukpadam

Leave a Comment