Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒక్కటేనన్న బండి సంజయ్!

కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒక్కటేనన్న బండి సంజయ్!
దోచుకో, దాచుకో సిద్ధాంతంతో పాలిస్తున్నారని విమర్శలు
మోదీని ఎదుర్కొనే దమ్ములేక గుంటనక్కలన్నీ ఏకమవుతున్నాయి విమర్శ
ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర
కరీంనగర్ లో సభ.. హాజరైన జేపీ నడ్డా
ధర్మం కోసమే బీజేపీ పోరాటం అన్న సంజయ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఐదు విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ , తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్ర విమర్శలు గుప్పించారు . జగన్, కేసీఆర్ లు ఒక్కటేనని దోచుకో ,దాచుకో అనేది వారి సిద్ధాంతం అని ధ్వజమెత్తారు . సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ ఛుగ్ కూడా ఉన్నారు . దీంతో జగన్ విషయంలోనూ బీజేపీ వైఖరి స్పష్టం అయిందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ఐదో విడత నేటితో ముగిసింది. కరీంనగర్ లో ముగింపు సభ ఏర్పాటు చేయగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విచ్చేశారు. ఈ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ, కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని స్పష్టం చేశారు. కరీంనగర్ గడ్డ గర్జిస్తే కొందరికి వెన్నులో వణుకుపుట్టాలని అన్నారు.

ప్రజల కోసం, ధర్మం కోసమే బీజేపీ పోరాటం అని పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని వివరించారు. తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలనను అంతమొందిస్తామని, తెలంగాణను కాషాయపు జెండాతో పవిత్రం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ స్ఫూర్తితో గడీల పాలనపై పోరాడుదామని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ పేరుతో తెలంగాణను తీసేశారని, బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒక్కటేనని… దోచుకో, దాచుకో అనే సిద్ధాంతంతో పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ఇద్దరు సీఎంలు కలిసి సమైక్యాంధ్ర అంటూ నాటకాలు ఆడుతున్నారని, తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీని ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని, కమీషన్ల కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దళితబంధు, రైతు బంధు ఇవ్వడంలేదని… ధరణి పోర్టల్ తో భూములు దోచుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు.

Related posts

అమరావతి రాజధానిపై కేసు జనవరి 28 కి వాయిదా…

Drukpadam

‘జగన్ బెయిల్ ర‌ద్దు’ పిటిష‌న్‌పై విచార‌ణ‌:.. రిజాయిండ‌ర్ దాఖ‌లు చేసిన ర‌ఘురామ‌..

Drukpadam

 చంద్రబాబుకు భారీ ఊరట… ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు

Ram Narayana

Leave a Comment