Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పాలేరులో షర్మిల ఎంట్రీ …ఆసక్తిగా మారిన జిల్లా రాజకీయాలు !

పాలేరులో షర్మిల ఎంట్రీఆసక్తిగా మారిన జిల్లా రాజకీయాలు !
షర్మిలను ఓడిస్తామన్న మంత్రి పువ్వాడ అజయ్
పాలేరును ఎంచుకోవడానికి కారణం ఏమిటి అనేది ఫజిల్ గా ఉంది
కరుణగిరి వద్ద పార్టీ కార్యాలయానికి శంకుస్థాపనకు ఖమ్మం వస్తున్న షర్మిల
ఆమె బీజేపీ వదిలిన బాణం అంటున్న ప్రతిపక్షాలు
నేను ఎవరు వదిలిన బాణం కాదంటున్న షర్మిల

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరులో పోటీచేస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు అయితే ఆమె పార్టీకి పెద్దగా ప్రజల మద్దతు లేదు . అయినప్పటికీ పాదయాత్రలో ప్రకటించినట్లుగా ఆమె పాలేరులోనే పోటీచేస్తున్నట్లు తిరిగి ప్రకటించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ చైతన్యం కల్గిన పాలేరు లో ఈసారి పోటీ రసవత్తరంగా మారె అవకాశం ఉంది. షర్మిల పాలేరును ఎంచుకోవడానికి కారణం ఏమిటి అనేది ఫజిల్ గా మారింది. ఆమె పాలేరు ఎంట్రీ కొత్త సమీకరణలకు దారితీసే అవకాశం కచ్చితంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే షర్మిల పోటీలో ఉంటె ఎలా ఉంటుంది . ఓటర్లు ఆమె వైపు మొగ్గుచూపుతారా ? ఆమెకు మద్దతు ఏపార్టీ ఇస్తుంది.లేదా ఒంటరిగానే పోటీ చేస్తారా ? అనే సందేహాలు ఉన్నాయి. ఒకవేళ ఆమె ఒంటరిగా పోటీచేస్తే విజయం అంత తేలికకాదు . ఎవరితోనైనా ఎన్నికల పొత్తు ఉంటె కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆమె పోటీచేసి ఓడిపోతే ఆమె పార్టీ కష్టాలు కొనితెచ్చుకున్నట్లే . అసలు ఆమె దైర్యం ఏమిటి ? ప్రతిపక్షాలు ఆమె బీజేపీ వదిలిన బాణం అని విమర్శలు చేస్తున్నాయి. ఆమె మాత్రం తాను ఎవరు వదిలిన బాణం కాదని ఆమె అంటున్నారు . అయినప్పటికీ ఆమె మాటలు నమ్మశక్యంగా లేవనే అభిప్రాయాలే ఉన్నాయి.

పాలేరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కందాల ఉపేందర్ రెడ్డి అధికార టీఆర్ యస్ అభ్యర్థి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై పోటీ చేసి విజయం సాధించడం సంచలనంగా మారింది. అయితే గెలిచిన కొంతకాలానికే ఆయన అధికార టీఆర్ యస్ లో చేరారు . దీంతో టీఆర్ యస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన తుమ్మలకు కష్టాలు మొదలైయ్యాయి . మంత్రిగా ఉండి ఉమ్మడి జిల్లాల్లో టీఆర్ యస్ అభ్యర్థులను గెలిపించాల్సిన తుమ్మల తానే ఓటమి పాలు కావడం సీఎం కేసీఆర్ ఆగ్రహం తెప్పించింది. నాటి నుంచి తుమ్మలను కనీసం కలిసేందుకు కూడా కేసీఆర్ నిరాకరించడంతో తుమ్మల అసహనంతో ఉన్నారు . నియోజకవర్గంలో ఆయన మాటకు చెల్లుబాటు కాకుండా పోయింది . దీంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కల్గిన తుమ్మల పార్టీలో ఉన్నప్పటికీ అసహనంగా ఫీలవుతున్నారు .

తాజా ఎమ్మెల్యే కందాలకు ఇస్తే తుమ్మలకు కోపం వస్తుందని భావిస్తున్న గులాబీ బాస్ ,కమ్యూనిస్టులతో పొత్తులో భాగంగా సిపిఎం కు కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే సిట్టింగులకు సీట్ల ఇస్తామని ప్రకటించడంతో కందాల తనకు సీటు గ్యారంటీ అంటున్నారు . తుమ్మల తాను పాలేరు నుంచే పోటీచేస్తానని ఢంకా భజావించి చెపుతున్నారు . ఇద్దరి
గొడవల మధ్య సీపీఎంకు ఇస్తే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీలో ఉండే అవకాశం ఉంది. బీజేపీ కూడా రంగంలో ఉంటుంది.ఏదైనా పార్టీతో పొత్తు ఉంటె అభ్యర్థి రంగంలో ఉండే అవకాశం ఉంది . కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు రంగంలో ఉంటారు . షర్మిల బీజేపీ తో కలుస్తుందా? లేక కాంగ్రెస్ తో దోస్తీ కడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఆమె శుక్రవారం రోజున పాలేరు నియోజకవర్గం పరిధిలోని ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి సమీపంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు . అందుకోసం ఆమె హైద్రాబాద్ నుంచి ఖమ్మం చేరుకుంటారు . షర్మిల పాలేరులో పోటీచేసేందుకు వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది . ఇక్కడ తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడంతోపాటు సిబ్బందిని నియమించే అవకాశం ఉంది . ఆమె పోటీ చేసి గెలుస్తారా ?లేదా అనేది ఆమె వ్యహరించే తీరు ,వేసే ఎత్తులపై ఆధారపడి ఉంటుంది

Related posts

ఉద్యోగులు కేసీఆర్ మాయమాటలు నమ్మకండి-రాములునాయక్

Drukpadam

జర్మనీలో తవ్వకాల్లో బయటపడిన 3 వేల ఏళ్లనాటి ఖడ్గం.. ఇప్పటికీ తళతళలాడుతూనే..!

Drukpadam

పోలింగ్ కోసం సర్వం సిద్ధం …ఖమ్మం కలెక్టర్ ,పోలీస్ కమిషనర్!

Drukpadam

Leave a Comment