Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తాను నమ్మకున్న పార్టీ నిర్ణయంపైనే తన రాజకీయ ప్రయాణం ఆధారపడి ఉంటుంది …పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!

తాను నమ్మకున్న పార్టీ నిర్ణయంపైనే తన రాజకీయ ప్రయాణం ఆధారపడి ఉంటుందిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!
కేసీఆర్ ,కేటీఆర్ పై నమ్మకం ఉంది
ఇప్పటివరకు పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముందుగా మీడియాకే చెపుతా
తేడా వస్తేనాతోపాటు నా టీం అంతా పోటీలో ఉంటుంది.
డాక్టర్ మట్టా దయానంద్ కు తొందరపడొద్దని చెప్పా
రాజకీయాల్లో ఉండటం ఖాయంపోటీ కూడా ఖాయం ఇందులో ఎలాంటి తేడా లేదు ..
దృక్పధంకు ఇచ్చిన ఇంటర్వ్యూ పొంగులేటి

ఖమ్మం జిల్లాలో కొద్దికాలంలోనే రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుపై ఎలాంటి క్లారిటీ లేదని చెప్పారు . ఇది చాలాకాలంగా జరుగుతున్న ప్రచారమేనని కొంతమంది బీజేపీలో చేరతానని ,మరికొంతమంది కాంగ్రెస్ లో చేరుతున్నానని ,ఇంకొందరు షర్మిల పార్టీలో చేరుతున్నానని చెప్పడంపై ఆయన నవ్వులు కురిపించారు .

తాను కేసీఆర్ కేటీఆర్ లపై నమ్మకం పెట్టుకున్నానని వారు కాదన్నప్పుడు ఆలోచిస్తానని అంతే కానీ వారినుంచి తనకు ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు పార్టీ మారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నారని జనవరి 23 తేదీన హైద్రాబాద్ నుంచి 3 విమానాలు బుక్ చేశారని, ప్రధాని మోడీ సమక్షంలో పెద్ద ఎత్తున బీజేపీలో చేరబోతున్నారని ఖమ్మం లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోదృక్పధంపలకరించగా ఆయన పై విధంగా స్పందించారుతాను విమానాలు బుక్ చేసినట్లు జరుగుతున్నా ప్రచారం వట్టిదేనని కొట్టిపారేశారు . ఇది నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని అన్నారు .ఇది పూర్తీ అవాస్తవం ఇది ఎవరో కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారం, దీన్ని నమ్మవద్దని అన్నారు . నేను ఒక రాజకీయపార్టీలో ఉన్నాను . ముందు కూడా రాజకీయాల్లో ఉంటానుకానీ పార్టీ మారాలనే ఆలోచన చేయలేదుగతంలో కూడా అనేక సార్లు ఇలాంటి పుకార్లు అనేకం వచ్చాయి. అనేక సార్లు నా అభిప్రాయాలూ చెప్పాను . నేను నమ్ముకున్న కేసీఆర్,కేటీఆర్ లు నా నమ్మకాన్ని విస్మరిస్తారని నేను అనుకోవడం లేదు . అందువల్ల పార్టీ మారాల్సిన అవసరం ఏముంటుంది ?అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు . సత్తుపల్లికి చెందిన డాక్టర్ మట్టా దయానంద్ పొంగులేటి తో విభేదించారనే విషయాన్నీ ప్రస్తావించగా దయానంద్ తో కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తమేనని, కానీ ఆయన్ను పిలిచి తొందర పడవద్దని చెప్పానని ఇప్పటివరకు అందరం ఒక టీంగా ఉన్నామని టీంగా ఉండాలని వివరించానని అన్నారు . ఒక వేళ పోటీ అనేది చేయాల్సి వస్తే టీంగానే పోటీ చేస్తామని, అయితే అది తాము నమ్మకున్న పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు .

గతంలో కూడా కేసీఆర్ ,కేటీఆర్ లు మీకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించారు కదా ? అని ప్రశ్నించగా చూద్దాం కొన్ని కారణాలవల్ల పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అందువల్ల అప్పడు నాయకులకు ఇబ్బందిగా ఉండవచ్చునని అన్నారు .ఈసారి ఎన్నికల్లో తన పోటీ మాత్రం ఖాయం అని చెప్పారు . నేను మాత్రమే కాదు నా టీం అంతా ఎన్నికల బరిలో ఉంటుందని చెప్పడం గమనార్హం…. రాజకీయాల్లో నిర్ణయాలు తీసుకోవడంపైపొంగులేటి కన్ఫ్యుజన్ లో ఉన్నారుచూద్దాం ఏమి జరుగుతుందో మరి !

Related posts

గెలిస్తే ఒక్కో మహిళకు నెలకు రూ.1000 ఇస్తాం… పంజాబ్ ఓటర్లకు గాలం వేస్తున్న కేజ్రీవాల్

Drukpadam

రాజ్ భవన్ ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ….

Drukpadam

మార్చి 10న ఢిల్లీలో ధర్నాకు ఎమ్మెల్సీ కవిత పిలుపు…!

Drukpadam

Leave a Comment