వ్యవసాయ కార్మికసంఘం 3 వ మహాసభలు …ఎరుపెక్కిన ఖమ్మం!
-ఖమ్మంలో సిపిఎం భారీ బహిరంగసభ …ఎర్రజెండా కవాతు
-వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ పాల్గొన్న తమ్మినేని ,ఇతర నేతలు
-భారీగా సభకు హాజరైన ప్రజలు
-పాటలతో ఉర్రుతలూగించిన ప్రజానాట్యమండలి కళాకారులు
ఖమ్మంలో జరుగుతున్న వ్యవసాయసంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఖమ్మం నగరం ఎరుపెక్కింది .చాలాకాలం తర్వాత ఎర్రసైన్యం ఖమ్మంలో ఎర్రసైన్యం కవాతు చూపరులను ఆకర్షించింది .కమ్యూనిస్టులు బలం తగ్గింది ,బలహీనపడ్డారు అని ప్రచారం జరుగుతున్న తరుణంలో మా బలం తగ్గలేదు .మేము పేదప్రజలకు అండగా ఉంటాం అంటూ ఖమ్మం పురవీధుల్లో కదం తొక్కటం చర్చనీయాంశంగా మారింది.
రెడ్ షర్ట్ వాలంటీర్లు ,ఎర్రచీరలు ధరించిన మహిళలతో జరిగిన కవాతు పురవీధులను పులకింప చేసింది . కదం తొక్కుతూ ,పదం పడుతూ హృదంతరాలను గర్జిస్తూ సాగిన తీరు ఆకర్షించింది . వారిని అనుసరిస్తూ తమ్మినేని వీరభద్రం ,బి వెంకట్ ,ఇతర నేతలు ప్రజలకు అభివాదం చేస్తూ వాహనంలో సభాస్థలి అయిన ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ కళాశాల మైదానంలోకి చేరుకున్నారు . అంతకు ముందు ప్రజలు నిర్వాకుల అంచనాలకు మించి వచ్చారు. దీంతో మైదానం మొత్తం ప్రజలతో నిండిపోయింది. ప్రజానాట్యమండలి కళాకారులు పాటలతో బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉర్రుతలు ఊగించారు. సభకు లేఖకు పై చిలుకు హాజరైయ్యారని సిపిఎం రాష్ట్ర నాయకులూ పోతినేని సుదర్శన్ ప్రకటించారు .