Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అటువైపా … ఇటు వైపా.. అయోమయంలో పొంగులేటి …!

అటువైపాఇటు వైపా.. అయోమయంలో పొంగులేటి …!
బీజేపీనేతల గాలంరంగంలోకి దిగిన బీజేపీ పెద్దలు

కాంగ్రెస్ పెద్దల మంతనాలు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేశాడంటూ ప్రచారం
నిర్దారించని పొంగులేటి క్యాంపు కార్యాలయం
కాంగ్రెస్ వైపు చూస్తున్న ఆయన అనుయాయులు

ఖమ్మం జిల్లా బీఆర్ యస్ కీలక నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీలో కంఫర్ట్ గా లేరు విషయాన్నీ ఆయనే స్వయంగా వెల్లడించారు . గత మూడున్నర సంవత్సరాలుగా పార్టీలో ఎలాంటి గౌరవం లభించిందో మీ అందరికి తెలిసిందేనని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చెప్పారు . ఆయన అన్న మాటలను బట్టి ఆయన బీఆర్ యస్ ను వీడేందుకు సిద్ధమైయ్యారని రాజకీయపండితులు అంచనాకు వచ్చారు . పైగా వచ్చే ఎన్నికల్లో తనతోపాటు తన టీం అంతా ఉంటుందని తెలిపారు .ఇక ఆయన తన మనసులోని మాటలు కుండబద్దలు కొట్టడంతో ఇక గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్నారని ప్రచారం జరుగుతుంది.

అమిత్ షా ఫోన్ …?

పొంగులేటి స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారని ప్రచారం జరుగుతుంది. విషయాలను నిర్దారించుకునేందుకు పొంగులేటి క్యాంపు కార్యాలయానికి ఫోన్ చేయగా వారినుంచి స్పందనలేదు . చేసింది లేనిది నిర్దారించడం లేదు . దీంతో బీజేపీ గట్టిగానే శ్రీనివాస్ రెడ్డి కోసం ప్రయత్నం చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉంది. అమిత్ షా నిజంగా చేశారా ? ఆయన రంగంలోకి దిగటం అంటే పొంగులేటి నిర్ణయం తీసుకుంటేనే దిగుతారు కదా ? అనే సందేహాలను రాజకీయ పండితులు వెలిబుచ్చుతున్నారు . నిజంగా ఆయన గులాబీ పార్టీని వీడబోతున్నారా ? ఆయన వీడితే ఖమ్మం జిల్లా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే చర్చకూడ జరుగుతుంది. పొంగులేటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయి.నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు . అందువల్ల బలమైన నేతగా ముద్ర ఉన్న పొంగులేటి తీసుకొనే నిర్ణయంపై జిల్లా రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఆయన బీజేపీలో చేరితే ఆయన అనుయాయులు ఆయనతో వెళతారా ?లేక వేరే దారి చూసుకుంటారా? అనేదానిపై ఆసక్తి నెలకొన్నదిచూద్దాం ఏమిజరుగుతుందో …!

Related posts

నాపై అన‌ర్హ‌త వేటు వేయ‌లేరుగాక వేయలేరు…ఎంపీ రఘురామ…

Drukpadam

ఇది ప్రగతి శీల బడ్జెట్ అన్న ప్రధాని మోడీ …

Drukpadam

భర్తతో గొడవపడి ఏకబిగిన 65 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భణి.. రెండు రోజులు రాత్రీపగలు నడక!

Drukpadam

Leave a Comment