Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ లో మారాల్సింది మనుషులు కాదు …వారి మనుసులు…!

ఠాగూర్ పోయారు ….థాకరే వచ్చారు….
-తెలంగాణ కాంగ్రెస్ లో ఇంచార్జి మార్పు
-టీపీసీసీ గ్రూప్ నుంచి ఠాగూర్ ఎగ్జిట్
-గోవా ఇన్‌చార్జ్‌గా మాణిక్యం ఠాగూర్ నియామకం
-ఆదేశాలు జారీ చేసిన పార్టీ అధిష్ఠానం
-తెలంగాణ భాద్యతలు ప్రియాంక చూస్తారని కొద్దీ రోజులుగా ప్రచారం …

తెలంగాణ కాంగ్రెస్ లో మారాల్సింది ఎవరు మనుషులా? లేక వారి మసులా ? అనేది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది .జబ్బున పడ్డ తెలంగాణ కాంగ్రెస్ కు చికిత్స చేసేందుకు వచ్చిన డాక్టర్ దిగ్విజయ్ సింగ్ …జబ్బు ఒకటైతే మందు ఒకటి అన్నట్లుగా తన సిఫార్స్ లో ఇంఛార్జిని మార్చాలని సూచించించారు . ఆయన సూచనకు అనుగుణంగా ఇంచార్జి మారారు . ఠాగూర్ పోయి , థాకరే వచ్చారు. దీంతో సమస్య పరిస్కారం అవుతుందా అంటే కథ మళ్ళీ మొదటికే అన్నట్లుగా ఉంది. అసలు కథ ఏమిటి సీనియర్లకు జూనియర్లకు మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి. టీపీసీసీ కమిటీలు , రాజకీయ సలహా కమిటీలో కేవలం రేవంత్ రెడ్డి సూచించినవారికే ఎందుకు పదవులు ఇచ్చారు. పీసీసీ చీఫ్ కు సమాన హోదాలో ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఏఐసీసీ కనీసం ఎందుకు సంప్రదించలేదనే సీనియర్ల అభియోగాలు పట్టించుకోలేదా? దానికి దిగ్విజయ్ చేసిన సిఫారసులు ఏమైయ్యాయి. దానిపై కాంగ్రెస్ పెద్దలు ఏమి చర్యలు తీసుకుంటున్నారు . తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇంఛార్జిని మార్చినంత మాత్రాన సమస్యలు పరిస్కారం అవుతాయా ? కాంగ్రెస్ కు మేలు జరుగుతుందని అనుకుంటే తాను పీసీసీ పదవి త్యాగం చేయడానికి సిద్ధమన్న రేవంత్ రెడ్డి మాటలు దేనికి సంకేతం ? ఎన్నికలు నెత్తిమీదకు వస్తున్న వేళ రాష్ట్ర భాద్యతలు ప్రియాంక స్వయంగా చూస్తారని అనుకుంటే మరో నేతకు కట్టబెట్టంపై ఉన్న కథాకమామీషు ఏమిటి ? అనేదానిపై కాంగ్రెస్ కార్యకర్తల్లోనే గందరగోళం ఉంది.

తెలంగాణ కాంగ్రెస్ లో గత కొంతకాలంగా జరుగుతున్నసీనియర్ల , జూనియర్ల పంచాయతీకి బ్రేక్ వేసేందుకు రంగంలోకి దిగిన ఏఐసీసీ ఎట్టకేలకు ఇంఛార్జిని మార్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు ,జూనియర్ల మధ్య పంచాయతీని తెలుసుకొని వాటికీ పరిస్కారం మార్గాలు చూసించాలిసిందిగా అధిష్టానం సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను పంపింది. ఆయన హైద్రాబాద్ వచ్చి రెండు మూడు రోజులు మకాం వేసి సుమారు 150 నుంచి అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి నివేదిక ఇచ్చారు . అందులో ఇక్కడ నాయకుల అభిప్రాయాలతోపాటు, సమస్య పరిష్కరానికి తన సూచనలు చేస్తూ నివేదిక ఏఐసీసీకి అందజేశారు . దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ వార్ రూమ్ పెద్దలు తెలంగాణ లో పరిస్థితిపై చర్చించి వెంటనే ఇంఛార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్ ను మార్చాలని తీర్మానించారు . దానిప్రకారం ఠాగూర్ ను మార్చుతూ మహారాష్ట్ర కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మాణిక్ రావు థాకరే ను నియమించింది .

అయితే తెలంగాణ నేతల మనుసులు మారకుండా ఇంఛార్జిగా ఉన్న మనుషులను మార్చితే సరిపోతుందా ? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. ఇది రాష్ట్రంలో సీనియర్ ,జూనియర్ల మధ్య పోరుగా కనపడుతున్నా వాస్తవానికి అదికాదనేది బహిరంగ రహస్యమే రానున్న ఎన్నికల్లో పార్టీ పవర్ ఎవరి చేతిలో ఉండాలనేదే ప్రధానమైన సమస్య …

ఇప్పటికే కాంగ్రెస్ అంతర్గత తగాదాలతో బలహీనపడింది. అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన దగ్గరనుంచి కాంగ్రెస్ లో బహిరంగ విమర్శలు ఎక్కువయ్యాయి. అధ్యక్ష పదవిని ఆశించిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పై బహిరంగ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే … ఇక ఆయన తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన సంగతి విదితమే.మర్రి శశిధర్ రెడ్డిలాంటి కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ కు బై చెప్పి బీజేపీకి జై కొట్టారు . మరికొందరు నేతలు పార్టీ వీడేందుకు సిద్దపడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై అటు బీజేపీ , ఇటు బీఆర్ యస్ సహజంగానే తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్ లో ఉన్న అసలు వ్యాధిని కనుక్కొని మందు ఇవ్వకపోతే మొదటికే మోసం రావడం ఖాయమని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు ….

 

Related posts

ప్రధాని రేసులో మోడీ, రాహుల్ మధ్యనే పోటీ…..

Drukpadam

ఆవేశంలో అన్న మాటలు అవి… వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వివరణ!

Drukpadam

పవన్ విశాఖను వీడాలి …ఏపీ పోలీస్ ..

Drukpadam

Leave a Comment