Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రక్తపు మరకలు …

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రక్తపు మరకలు …కలెక్టర్ ఆఫీస్ వద్ద రైతుల ఆందోళన …లాఠీచార్జి పరిస్థితి ఉద్రిక్తం…!
-సంతోష్ అనే రైతుతో పాటు మరో ఇద్దరు మహిళలకు గాయాలు
పోలీస్ లకు కూడా గాయాలు
-కలెక్టర్ బయటకు రావాలని ఆందోనళ కారుల డిమాండ్ …
-ఆందోనళకారులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు
-కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ పై కేటీఆర్ ఆగ్రహం
-కామరెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్న 8 గ్రామాల ప్రజలు
-ఇండస్ట్రియల్ జోన్ కు తమ భూములను ఇవ్వలేమని ఆందోళన
-మాస్టర్ ప్లాన్ సమస్య ఎందుకొచ్చిందన్న కేటీఆర్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రక్తపు మరకలు అంటాయి. మాస్టర్ ప్లాన్ లో భాగంగా ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా అధికారులు 8 గ్రామాల పరిధిలోని సుమారు 1200 ఎకరాల భూములను పారిశ్రామిక ప్రాంతంలో కలపడాన్ని ఆగ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు .అనేక సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా రైతుల మాటలను పెడచెవిన పెట్టి మాస్టర్ ప్లాన్ లో కలపడాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకోని పోయేందుకు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వందలాది మంది రైతులు చేరుకున్నారు . కలెక్టర్ ను కలవాలని సుమారు 4 గంటలకు పైగా ఆందోళన నిర్వహించారు . కలెక్టర్ రైతులను కలవడానికి రాకపోవడంపై ఆగ్రహం చెందిన రైతులు కలెక్టరేట్ గేట్ దూకి లోనికి ప్రవేశించారు . ఈ సందర్భంగా రైతులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం , తోపులాట జరిగింది. చివరకు లాఠిఛార్జికి దారితీసింది . ఒక పోలీస్ కానిస్టేబుల్ తోపాటు ముగ్గురు పలువురు రైతులకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతలకు దారితీసింది.

మున్సిపల్ కమిషనర్ పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం …

కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ సమస్య ఎందుకు వచ్చిందని మున్సిపల్ కమిషనర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉందని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారని మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఈ ప్రభుత్వం లేదని అన్నారు. నగరాలను అభివృద్ధి చేసేందుకే మాస్టర్ ప్లాన్ అని చెప్పారు.

కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ లో ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎనిమిది గ్రామాలను చేర్చారు. ఈ గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్ కు కేటాయించనున్నారు. అయితే దీన్ని ఆయా గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. తమకు జీవనోపాధిని కల్పించే భూములను ఇవ్వబోమని అంటున్నారు.

తన భూమి పోతుందనే భయంతో రాములు అనే రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. తాము భూములను వదులుకునే ప్రసక్తే లేదని అన్నారు. రైతులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిలు సైతం ధర్నాలో పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు పుట్టిస్తున్న కారు పార్టీలో కబ్జాల వ్యవహారం

Drukpadam

మీ ట్వీట్ వల్ల పార్టీ పరువు పోయింది: విజయసాయిరెడ్డిపై రఘురామకృష్ణరాజు ఫైర్

Drukpadam

మాజీ ఐఏఎస్ లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేశ్ లపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్!

Drukpadam

Leave a Comment