Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటికి మంత్రి పువ్వాడ కౌంటర్ …

పొంగులేటికి మంత్రి పువ్వాడ కౌంటర్ …
-పార్టీలో గౌరవం గురించి కొందరు మాట్లాడటం హాస్యాస్పదం …
-కొందరు పార్టీని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని హాట్ కామెంట్స్ …
-ఇలాంటి చర్యలను ఖమ్మం జిల్లా బీఆర్ యస్ నాయకత్వం సహించదని హెచ్చరిక …
-గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు కూడా కుట్ర జరిగిందన్నపువ్వాడ …
-మళ్ళీ కుట్రలు జరగవచ్చు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి
-బహిరంగ వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణ తప్పినట్టే కదా అన్న మంత్రి
-అన్యాయం జరిగితే పార్టీ అధినేతతో చర్చించాలని హితవు …

జనవరి 1 వతేదీన మాజీఎంపీ పొంగులేటి ఆత్మీయ కలయిక పేరుతో తన నివాసంలో కేక్ కట్ చేసి ఆసందర్భంగా చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించాయి. బీఆర్ యస్ పార్టీలో గత నాలుగు సంవత్సరాలుగా ఏపాటి గౌరవం దక్కిందో అందరికి తెలుసునని అనడం పై పార్టీ హైకమాండ్ సీరియస్ గానే రియాక్ట్ అయింది. ఆయనకు ఉన్న భద్రత తగ్గించడంతోపాటు , ఇంటిదగ్గర ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ ను ఎత్తివేశారు . దీనిపై పొంగులేటి అనుయాయులు భగ్గు భగ్గు మంటున్నారు .దీనిపై జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు . ….

కొందరు నేతలు పార్టీలో గౌరవం పొంది అనేకం అనుభవించి గౌరవం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు . ఇప్పటివరకు ఎలాంటి గౌరవం లభించిందో వారికీ తెలియదా అని ప్రశ్నించారు . పార్టీని గురించి చులకనగా మాట్లాడటం , గ్రూప్ రాజకీయాలు చేయడం పార్టీ కట్టు తప్పినట్లు కదా అని మంత్రి అన్నారు . పార్టీలో క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు .ఎవరైనా తనకు అన్యాయం జరిగిందని భావిస్తే పార్టీకి చెప్పుకోవచ్చుకాని బహిరంగంగా మాట్లాడి పార్టీ పరువు బజారుకు విడ్చితే ఎంతటివారైనా సహించేది లేదని మంత్రి కఠినంగా చెప్పారు .ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో జిల్లా రాజకీయాల్లో బీఆర్ యస్ ను ఎవరైనా ఓడించాలని చేస్తే వారు ఓడిపోకతప్పదని హెచ్చరించారు . సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు . దేశమంతా తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు . తెలంగాణ అభివృద్ధి తమ రాష్ట్రాల్లో కూడా జరగాలని అందువల్లనే బీఆర్ యస్ ఏర్పాటు చేసి తెలంగాణ పథకాలు దేశంలో అమలు జరిపేందుకు సిద్దమైన విషయాన్నీ మంత్రి గుర్తు చేశారు .

పార్టీలో అన్యాయం జరిగిందన్నవాళ్ళు అధినేతతో చర్చించాలిగాని బహిరంగసభల్లో చెప్పడం దేనికి సంకేతమని పార్టీ శ్రేణులు గ్రహించాలని అన్నారు . బహిరంగ వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణ తప్పినట్లేనని అన్నారు .

ఎన్నికల సమయంలో తనపై కుట్రలు చేశారని , కొందరు ఓడించాలని కూడా వాళ్లకు ఉన్న అవకాశాలను ఉపయోగించారని అయినప్పటికీ ఖమ్మం ప్రజలు తనపై ఉన్న నమ్మకంతో గెలిపించారని వారి దయవల్లనే గెలిచి సీఎం కేసీఆర్ దయతో మంత్రిని అయ్యానని అన్నారు . మళ్లీ తనపై కుట్రలు జరగవచ్చునని అందుకే పార్టీ శ్రేణులు ప్రజలను అప్రమత్తం ఉండాలని విజ్ఞప్తి చేశారు .

Related posts

పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించండి …లేదంటే ఆందోళన : బెంగాల్ ప్రభుత్వానికి బీజేపీ హెచ్చరిక!

Drukpadam

ఆదర్శంలో కమ్యూనిస్టులకు సాటి మరెవరు లేరు …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు!

Drukpadam

ఈ నెల 26న రాజ్‌భవన్‌ల ముట్టడి: కిసాన్‌ సంయుక్త మోర్చా…

Drukpadam

Leave a Comment