Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హైద్రాబాద్ లో పవన్ …చంద్రబాబు భేటీ ఏపీ రాజకీయాలపై చర్చ …!

హైద్రాబాద్ లో పవన్ …చంద్రబాబు భేటీ ఏపీ రాజకీయాలపై చర్చ …!
చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ రాక
దుర్మార్గ పాలన పోవాలన్నా చంద్రబాబు
కుప్పంలో తన పర్యటన అడ్డుకోవడంపై మండిపాటు
పవన్ పర్యటనలకు సైతం ఆటంకం కల్గిస్తారం ఆరోపణలు
జి ఓ నెంబర్ వన్ ఎందుకు తెచ్చారని ప్రశ్న
నియంతపాలపై అందరం ఏకమౌతామని ఉద్ఘాటన
ఇరువురి మధ్య సుదీర్ఘ సమావేశం
చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన పవన్ కల్యాణ్
చంద్రబాబును కలవడానికి ముఖ్య కారణం ఇదే: పవన్ కల్యాణ్

 

  • ఏపీ రాజకీయాలు , జగన్ పాలనపై చర్చించేందుకు ఆదివారం చంద్రబాబు నాయుడు ,పవన్ కళ్యాణ్ లు హైద్రాబాద్ లో సమావేశమైయ్యారు . ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు అడ్డుకోవడంపై చర్చించారు . జగన్ దుర్మార్గపు పాలన పోవాలని అందుకు అందరం ఐక్యం కావాలని పిలుపు నిచ్చారు . ఇప్పటికే ఆదిశగా ప్రతిపక్షాలన్నీ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించారు . జి ఓ నెంబర్ వన్ తేవడం జగన్ నియంత పోకడలకు నిదర్శనం అన్నారు . దీనిపై పోరాడాలని నిర్ణయానికి వచ్చారు . వ్యవస్థలోని అన్ని అంగాలను ఇందుకు ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు . భేటీ అనంతరం మీడియా తో మాట్లాడారు .

జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియా ఎదుట మాట్లాడారు. ఇవాళ తాను ప్రత్యేకించి చంద్రబాబును కలవడానికి ముఖ్య కారణం మొన్న కుప్పంలో జరిగిన సంఘటన అని వెల్లడించారు. 

వైసీపీ అరాచకాలు, చంద్రబాబును తిరగనివ్వకపోవడం, ఆయనను ప్రజల వద్దకు వెళ్లనివ్వకపోవడం, ఆయన హక్కులను కాలరాయడం, కేసులు పెట్టడం వంటి ఘటనలను చూసి, వాటిపై మీడియా ప్రకటనలు కూడా ఇచ్చానని పవన్ వెల్లడించారు. కుప్పంలో జరిగిన సంఘటనకు సంబంధించి నేడు చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు వచ్చానని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో అరాచక పాలన, పెన్షన్లు తొలగింపు, ఫీజు రీయింబర్స్ మెంట్, శాంతిభద్రతలు లోపించడం, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వానికి తన బాధ్యతలను గుర్తుచేయడం వంటి అంశాల గురించి తామిరువురం విస్తృతంగా చర్చించుకున్నామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్రజలకు వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలపై మాట్లాడనివ్వకుండా ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి చట్టం తీసుకురావడం, ప్రత్యర్థి పార్టీలను అడ్డుకునేందుకు ఇలాంటి చెత్త జీవోలు తీసుకురావడాన్ని ఆపాలని బలంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. 

ఈ జీవో తీసుకురావడానికి ముందే తనను వైజాగ్ లో అడ్డుకున్నారని, వాహనంలోంచి దిగకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు, గదిలోంచి బయటకు రాకూడదు అని ఆంక్షలు విధించారని పవన్ తెలిపారు. 

తనకేకాదు, సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి, నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబుకు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురైందని వివరించారు. అందుకే ఆయనకు మద్దతు తెలిపేందుకు వచ్చానని, భవిష్యత్తులో ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకునేలా చేయడం కోసం ఏంచేయాలన్న దానిపై చంద్రబాబుతో కూలంకషంగా మాట్లాడినట్టు తెలిపారు.

Related posts

ఉచిత విద్యుత్ పై బీఆర్ యస్ ది గోబెల్స్ ప్రచారం …సీఎల్పీ నేత భట్టి

Drukpadam

టీఎంసీ ఎంపీ భుజం తట్టిన రాజ్‌నాథ్ సింగ్..

Drukpadam

భారత రాజకీయాలను మలుపు తిప్పే శక్తి ఒక్కకేసిఆర్ కే ఉంది:మంత్రి పువ్వాడ!

Drukpadam

Leave a Comment