Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కందాల బర్త్ డే వేడుకలు బలప్రదర్శనగా మారనున్నాయా ?

కందాల బర్త్ డే వేడుకలు బలప్రదర్శనగా మారనున్నాయా ?
-భారీగా పాలేరు ఎమ్మెల్యే కందాల బర్త్ డే వేడుకలు …
-కూసుమంచి లో ఘనంగా ఏర్పాట్లు …
-వేలాదిగా తరలిరానున్న అభిమానులు …కార్యకర్తలు
-ఉమ్మడి జిల్లాలో 10 కి 10 సీట్లు అంటున్న బీఆర్ యస్ నేతలు

ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి బర్త్ డే వేడకలు జనవరి 9 వ తేదీన కూసుమంచి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు .ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ బర్త్ డే వేడుకలు బలప్రదర్శనగా మారె అవకాశాలు ఉన్నాయి . ఈ వేడుకలకు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మలను ఓడించిన మొనగాడుగా కందాల రికార్డులకు ఎక్కారు . మంత్రిగా ఉండి తుమ్మల ఓడిపోవడం పై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు . ఖమ్మం జిల్లాలోని గ్రూప్ తగాదాలపై కన్నెర్ర చేశారు . నాటి నుంచి బలమైన ఇద్దరు నేతలపై గుర్రుగా ఉన్న గులాబీ బాస్ వారికీ కనీసం ఆపాయిట్మెంట్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం . పాలేరు నుంచి కాంగ్రెస్ టికెట్ పై గెలిచి టీఆర్ యస్ లోకి చేరిన కందాల పాలేరుపై పట్టు బిగించే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు . ఎన్నికలకు ముందు జరుగుతున్న బర్త్ డే వేడుక అయినందున ప్రతిష్టాత్మకంగా తీసుకోని చేస్తుండటం ఆసక్తిగా మారింది.

మరి కొద్దీ నెలల్లో ఎన్నికలు జరగ నుండటంతో ఈ వేడుకలను బలప్రదర్శనకు వేదికగా ఉపయోగించుకోనున్నారు . ఇటీవలనే బీఆర్ యస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి తుమ్మల పాలేరు నియోజకవర్గంలో నూతన గ్రహప్రవేశం పేరుతో వేలాది మంది తన అనుయాయులను ఆహ్వానించి ఆత్మీయ పలకరింపులతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు . బీఆర్ యస్ నుంచి ఈసారి తానే పాలేరు లో పోటీ చేయబోతున్నట్లు చెబుతున్నారు . బీఆర్ యస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్ లందరికి సీట్లు ఖాయమని చెప్పిన నేపథ్యంలో తనకు సీటు గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్న కందాల అందుకు అనుగుణంగా నియోజకవర్గంలో స్పీడ్ పెంచారు . ఖమ్మం టు పాపటపల్లి వరకు రోడ్ వెడల్పు ఎన్ ఎస్పీ అక్విడెక్టు వద్ద నిర్మించనున్న అండర్ బ్రిడ్జి కి రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రిని ఆహ్వానించి శంకుస్థాపనలు చేయించారు .

ఆ సందర్భంగా రామన్నపేట వద్ద జరిగిన బహిరంగసభలో పాల్గొన్న మంత్రి ప్రశాంతారెడ్డి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తిరిగి పోటీచేస్తారని ప్రకటించడం జిల్లాలోని ప్రజాప్రతినిధులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది . తిరిగి కందాల పోటీచేసినా, చెప్పాల్సింది సీఎం కేసీఆర్ కదా ? మంత్రి ఎందుకు ప్రకటించారు ? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. తమకే పాలేరు సీటు అంటూ ప్రచారం చేసుకుంటున్న తుమ్మల వర్గీయులను మంత్రి ప్రకటన నిరాశకు గురిచేసింది . ఇక సిపిఎం కూడా పాలేరు సీటును గట్టిగా కోరుతుండటంతో సీఎం ప్రమేయం లేకుండా ప్రశాంత రెడ్డి బహిరంగ సభ సాక్షిగా కందాల తిరిగి పోటీచేస్తారని చెప్పే సాహసం చేస్తారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . ఒకపక్క కమ్యూనిస్టులకు మునుగోడు ఎన్నికల సందర్భంగా కలిసి పోటీచేద్దాం అని చెప్పిన సీఎం కేసీఆర్ మరోపక్క మంత్రుల చేత ఎమ్మెల్యేలను మీరే పోటీలో ఉంటారని చెప్పించడంలో ఔచిత్యం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది . ఇది సీఎం కేసీఆర్ కు తెలిసి జరుగుతుందా లేక తెలియకుండా జరుగుతుందా అనే మీమాంస వెంటాడుతుంది.

ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు . ఎన్నడూ లేనిది ఒకేసారి ఇద్దరు రాజ్యసభ సభ్యులను జిల్లా నుంచి పంపించారు . జిల్లాకు కావాల్సిన నిధులను అడిగిందే తడువుగా ఇస్తున్నారు . అందువల్ల ఈసారి ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 కి 10 సీట్లు గెలిచి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని జిల్లా మంత్రి అజయ్, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతామధు తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు అనేక వేదికల మీద నుంచి చెబుతున్నారు . పైకి ఐక్యం అంటూనే లోన కుట్రలు, కుతంత్రాలతో గులాబీ పార్టీ నేతలు వ్యవహరిస్తుండటం కార్యకర్తలను సైతం అయోమయానికి గురిచేస్తుంది.

Related posts

కాంగ్రెస్ ఎన్నడూ సాకులు చెప్పలేదు.. నైతిక బాధ్యత వహించడానికి సిగ్గుపడలేదు: రాహుల్ గాంధీ…

Drukpadam

అమెరికాలో భర్త అకాలమరణం.. అంబర్ పేటలో భార్య ఆత్మహత్య!

Drukpadam

ఆకాశంలో ఐదు గ్రహాల అరుదైన కలయిక.. 158 ఏళ్ల తర్వాత ఇప్పుడే..

Drukpadam

Leave a Comment