Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం మాజీఎంపీ పొంగులేటి బీజేపీ గూటికి …?

ఖమ్మం మాజీఎంపీ పొంగులేటి బీజేపీ గూటికి …?
చర్చలు పూర్తీ అయినట్లు విస్తృత ప్రచారం…
రాష్ట్రంలో కీలక నేతగా పొంగులేటి బాధ్యతలు…!
దీనిపై స్పందించని పొంగులేటి కార్యాలయం
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో కీలక పరిణామం
పొంగులేటితో నేరుగా చర్చలు జరుపుతున్న బీజేపీ అధిష్ఠానం
ఈ నెల 18న అమిత్ షాను పొంగులేటి కలవనున్నారని సమాచారం
ఉమ్మడి జిల్లాలో పర్యటనలు జోరు పెంచిన పొంగులేటి

తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన కేసీఆర్.. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ జాబితాలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. పొంగులేటి బీజేపీ గూటికి వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో కీలక బాధ్యతలు ఒప్పగించడంతోపాటు , జిల్లాలో ఆయన చెప్పినవారికి సీట్లు ఇస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే జిల్లా రాజకీయాల్లో బీజేపీ పాత్ర కూడా పెరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం .

వీరి పేర్లు చాలారోజులుగా వినిపిస్తున్నప్పటికీ వారు ఆ ప్రచారాన్ని పట్టించుకోలేదు . అయితే శ్రీనివాస్ రెడ్డి 2023 జనవరి 1 వతేదీన ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలు …ఆయన చేసిన ప్రసంగం బీఆర్ యస్ నుంచి తాను బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు సంకేతాలు ఇచ్చాయి. బీఆర్ యస్ లో తమకు ఏమ్పటి గౌరవం దక్కిందో అందరికి తెలిసిందేనని ఆనడం గులాబీ నాయకులకు గుచ్చుకుంది . దీంతో ఆయనకు అప్పటివరకు కల్పిస్తున్న 3 +3 భద్రతను కుదించి 2 +2 చేశారు . ఎస్కార్ట్ వాహనం తొలగించారు . ఇంటివద్ద భద్రతా పోస్ట్ ను ఎట్టి వేశారు . ఇది ఆయనను అవమానించడమేనని ఆయన అభిమానులు , అనుయాయులు మండి పడ్డారు . ఎంపీగా టికెట్ ఇవ్వకపోగా , సీఎం కేసీఆర్ తనకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంపై పొంగులేటి రగిలి పోతున్నారు . తన రాజకీయాల్లో కచ్చితంగా ఉండాలి …అయితే నేను ఉండమన్న పార్టీ నుంచి ఆదరణ లభించడంలేదు . పైగా అవమానాలు ..అందువల్ల తనను నమ్ముకున్న కార్యకర్తలు , అనుయాయులు , ప్రజల అభీష్టం మేరకు రాజకీయ నిర్ణయం ఉంటుందని ప్రకటించి తాను పార్టీ మారుతున్నట్లు చెప్పకనే చెప్పారు . అయితే ప్రస్తుత పరిస్థిల్లో దేనిలో చేరాలి అంటే కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీలో చేరడం ద్వారా తన సత్తా చాటాలని నిర్ణయానికి వచ్చినట్లు విఫరీతమైన ప్రచారం జరుగుతుంది. దానిపై ఆయన నోరు పెదపటంలేదు . కానీ ఇక యుద్దానికి సిద్ధం జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమే అని అంటున్నారు పొంగులేటి .

దీంతో బీజేపీలోకి పొంగులేటి చేరిక దాదాపు ఖాయమైపోయిందని అంటున్నారు. బీజేపీ అధిష్ఠానం పొంగులేటితో నేరుగా చర్చలు జరుపుతోందని సమాచారం. ఈ నెల 18న సీఎం కేసీఆర్ పర్యటన ఉన్న రోజునే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పొంగులేటి భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కీలక ప్రకటన వెలువడుతుందని చెపుతున్నారు.

మరోవైపు బీజేపీలో చేరాలనే నిర్ణయం నేపథ్యంలో ఇప్పటికే తన సహచరులతో పొంగులేటి ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి పలు నియోజవర్గాల్లో తన అనుచరులతో భేటీ కానున్నారు. మరోవైపు ఇటీవల పొంగులేటి మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రానికి శీనన్న సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. ప్రజల అభిమానం ఉన్నవాడే అసలైన నాయకుడని… తనకు పదవి లేకపోయినా ప్రజాభిమానం ఎంతో ఉందని అన్నారు.

Related posts

సీఎం వ‌ర్సెస్ స్పీక‌ర్‌.. బీహార్ అసెంబ్లీలో ర‌చ్చ‌ర‌చ్చ‌!

Drukpadam

ఏపీ యస్ ఇ సి ఏకపక్ష నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల మండిపాటు

Drukpadam

డీఎంకే అధినేత స్టాలిన్ కు ఫోన్ చేసిన సీఎం జగన్…

Drukpadam

Leave a Comment