తుమ్మల రాజకీయ చాణిక్యం ఫలిస్తుందా …?
-పొంగులేటి దూరం …తుమ్మలను దగ్గరకు చేర్చుకుంటున్న వైనం
-కేటీఆర్ మామ దశ దినకర్మలో సీఎం కేసీఆర్ వెంట తుమ్మల
-కేటీఆర్ తో కబుర్లు
-శాసనసభ , మండలి చైర్మన్లతో కలివిడిగా తిరిగిన తుమ్మల
రాజకీయాలు అంటే ఇంతే ఉంటాయి…దానినే రాజకీయ చాణిక్యం అంటారు . దాన్ని సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి తుమ్మల అందిపుచ్చుకునే వ్యూహం పన్నినట్లు ఉన్నారు . అది ఫలిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. పొంగులేటి బీఆర్ యస్ నుంచి బయటకు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతున్నవేళ తుమ్మల చకచకా పావులు కదుపుతున్నారు . ఈసారి పాలేరు నుంచి పోటీచేయాలి గట్టి పట్టుదలతో ఉన్న తుమ్మల జిల్లాలో రాజకీయపరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో నిమగ్నమైయ్యారు .కేటీఆర్ మామ కర్మల కార్యక్రమంలో పాల్గొన్నారు .అక్కడ చాలాకాలం తర్వాత సీఎం కేసీఆర్ తో కలిసి కేటీఆర్ మామకు నివాళులు అర్పించారు . కేటీఆర్ తో కబుర్లు చెబుతూ కనిపించారు. శాసన మండలి చైర్మన్ , శాసన సభ స్పీకర్ లతో సరదాగా మాట్లాడుతూ కనిపించారు .పొంగులేటి పార్టీని వీడుతున్నందున తుమ్మలను దగ్గరకు చేర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని అభిప్రాయాలు కలుగు తున్నాయి.
ఖమ్మం జిల్లా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి పార్టీని వీడటం ఖాయమని ప్రచారం జరుగుతుంది . ఈ నేపథ్యంలో ఆయన అవుట్ కాగా పార్టీకి ఇప్పటివరకు దూరంగా ఉన్న తుమ్మల సడన్ గా సీఎంకు అత్యంత దగ్గరగా కనిపించడంతో ఆయన పార్టీలో ఇక చురుగ్గా పాల్గొనే అవకాశాలు తోచిపుచ్చలేమని ఆయన అనుయాయులు పేర్కొంటున్నారు .
గత ఎన్నికల్లో మంత్రిగా ఉండి పాలేరు లో టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలైయ్యారు . ఉమ్మడి జిల్లాలో సీట్లు గెలిపించకపోవడం , చివరకు తన సీటు కూడా కోల్పోవడంతో తుమ్మలపై సీఎం గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నాటి నుంచి సీఎం తుమ్మలను దూరం పెట్టారు .అనేక సార్లు సీఎంను కలిసి ఓటమికి దారితీసిన పరిస్థితులను వివరించాలని ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ ఇచ్చేందుకు సీఎం అంగకరించలేదు . ఢిల్లీలో బీఆర్ యస్ భవనం శంకుస్థాపన సందర్భంగా లోకసభ పార్టీ పక్ష నేత నామ నాగేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు తుమ్మల హాజరైయ్యారు .అప్పుడు కూడా పొడిపొడిగా మాట్లాడుకున్నారు తప్ప అంతకు ముందు ఉన్న ఆప్యాత కనిపించలేదు . తర్వాత జిల్లాలో కూడా తుమ్మల పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లు ఉంటున్నారు . దీంతో తుమ్మలకు తిరిగి పాలేరు సీటు ఇవ్వడం కుదరకపోవచ్చని అందువల్ల ఆయన పార్టీ వీడతారని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతుంది. దానిపై తుమ్మల ఎప్పుడు ఎలాంటి కామెంట్ చేయలేదు . ఆయన పార్టీ వీడతారనే అనుమానాలు రోజురోజుకు బలపడుతూనే ఉన్నాయి.
2023 జనవరి 1 తేదీన పాలేరు నియోజకవర్గ పరిధిలోని శ్రీసిటీ లో నూతన గుర్హప్రవేశం చేశారు . ఆసందర్భంగా హంగామా సృష్టించారు . జిల్లా అంతటినుంచి తన అనుయాయిలు రప్పించారు . వచ్చిన వారినందరిని కలిసిన తుమ్మల ఆప్యాయంగా పలకరించారు . రానున్న ఎన్నికల్లో తిరిగి పాలేరు నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు .జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీరు అందించడమే తన లక్ష్యమని తెలిపారు . కొన్ని సందేహాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా జవాబు చెప్పేందుకు ఇష్టపడలేదు .
గత ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన కందాల టీఆర్ యస్ లో చేరడంతో నియోజకవర్గం పై తుమ్మలకు పట్టు తగ్గింది . దీంతో తుమ్మల తన ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు .తిరిగి పాలేరులో గెలవడం ద్వారా రాజకీయాల నుంచి గౌరప్రదంగా వైదొలగాలని భావనలో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది . అయితే బీఆర్ యస్ నుంచి ఆయనకు టికెట్ రావడం అంత తేలిక కాదనే అభిప్రాయాలు లేకపోలేదు . పైగా పొంగులేటి పార్టీని వీడితే కందాలకు టికెట్ ఇవ్వకపోతే ఆసామాజికవర్గానికి రాంగ్ సిగ్నల్స్ వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల సిపిఎం కు సీటు ఇవ్వకపోతే సిట్టింగ్ గా ఉన్న కందాలను కాదని తుమ్మలకు ఇవ్వడం అంత తేలికైన పని కాదు . అయితే రాజకీయాలుకదా ? ఏదైనా జరగవచ్చు …
కేసీఆర్ సిట్టింగ్ లందరికి సీట్లు ఇస్తామని పార్టీ సమావేశంలో చెప్పడంతో సిట్టింగ్ లలో తమకే టికెట్స్ అనుకుంటున్నారు .కానీ తుమ్మల పాలేరు లో తాను పోటీలో ఉంటానని , బీఆర్ యస్ నుంచి తనకే టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు . కందాల అదే స్థాయిలో సీటుపై తనకు రావడం గ్యారంటీ అంటున్నారు . ఎవరికీ వారు నియోజకవర్గంలో పర్యటిస్తూ తిరిగి పోటీచేస్తామని తమకే పార్టీ టికెట్ ఇస్తుందని నమ్మకంగా చెబుతున్నారు . పాలేరు బీఆర్ యస్ లో రెండు గ్రూప్ లు పడి కొట్టుకుంటున్నాయి.ఎవరికీ సీటు ఇచ్చినా మరొకరి కోపంగా ఉంది. ఫలితంగా పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సీటు సిపిఎం కూడా తమకు కావాలని కోరుతుంది. దీంతో ఒకదశలో సీఎం కేసీఆర్ సిపిఎం కు సీటు కేటాయిస్తే తమకు ఉన్న తగాదా పరిస్కారం అవుతుందనే ఆలోచనతో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతుంది .పార్టీలో తుమ్మల , కందాల కు సముచిత స్థానం ఇవ్వడం ద్వారా వారిని మెప్పించాలని గులాబీ బాస్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి …