పార్టీ మార్పు ఆలోచన సీక్రెట్ గా చేయను …మాజీ ఎంపీ పొంగులేటి !
లక్షలాది మంది ప్రజల సమక్షంలోనే ప్రకటిస్తా …!
ప్రజల్లో తిరగటానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు
ప్రజల ఆదరణ ఉన్నంతకాలం వారికోసం తిరుగుతాను
రాజకీయాల్లో ప్రజలే నాకు గాడ్ ఫాదర్లు…
పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనిషిని మనిషిగా గౌరవించాలి
కేసీఆర్, కేటీఆర్ పై నమ్మకంతోనే పార్టీలో చేరాను
తనకు సెక్యూర్టీ ఇవ్వమని అడగలేదు
తీస్తానంటే వద్దని అనను…
పార్టీ మార్పు ఆలోచన చేయలేదు …ఒకవేళ చేయాల్సి వస్తే సీక్రెట్ గా చేయను అది నా మనస్తత్వానికి విరుద్ధం … లక్షలాది మంది సమక్షంలోనే నా నిర్ణయం ప్రకటిస్తా ? అని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు . ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పినపాక ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు .శీనన్న నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు ఏజెన్సీలో మారుమోగాయి. వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పూర్తితో స్వార్ధం లేకుండా రాజకీయాల్లోకి వచ్చాను ..ప్రజలతో కనెక్ట్ అయ్యాను వారికోసం ఏదన్న చేయాలన్న తలంపు తప్ప మరో ఆలోచన నాకు లేదు . పదవులు శాశ్వితంకాదు ..పదవులు ఉన్న లేకున్నా మనుషులను మనుషులుగా చూడాలి …నాకు సెక్యూర్టీ తగ్గించారు .సెక్యూర్టీ కావాలని నేను అడగలేదు . ఉన్న వాళ్ళను తీసివేసినా అభ్యంతరం లేదు . ప్రజల దీవెనలు ఉంటె చాలు …నాకు ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజలు నాపై నమ్మకంతో నాతో ఉంటున్నారు . వారు రుణం తీర్చుకోలేనిది వారితరుపున గొంతు వినిపిస్తా.
పినపాకలో నీకు పనేంటని కొందరు అంటున్నారని, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే వచ్చానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నాననో, పార్టీ మారడం లేదనో చెప్పడంలేదు… నా మనసులోని ఆవేదనను చెబుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.
కేసీఆర్, కేటీఆర్ పై నమ్మకంతోనే నాడు టీఆర్ఎస్ లో చేరానని వెల్లడించారు. అయితే, నాలుగేళ్లుగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని, సందర్భం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానని అన్నారు. నిజాన్ని అప్పుడూ నిర్భయంగా చెప్పాను, ఇప్పుడూ చెబుతాను…. నా వ్యాపారలావాదేవీలపై త్వరలోనే చెబుతాను అని వెల్లడించారు.
‘నేను సెక్యూరిటీ అడిగితే మీరు ఇవ్వలేదు… ఇప్పుడు నా భద్రత తగ్గించినా నేను అడగను, ఉన్న ఇద్దరు గన్ మన్లను తీసేసినా నేను బాధపడను… నాకు సెక్యూరిటీ అవసరంలేదు’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.
తనకు రాజకీయంగా గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరని, తెలంగాణ ప్రజలే తనకు గాడ్ ఫాదర్లు అని వెల్లడించారు. పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా మనిషిని గౌరవించాలని అభిప్రాయపడ్డారు. పదవులు అవే వస్తాయి… పోయేటప్పుడు అవే పోతాయని అన్నారు. తానేమీ భూదందాలు చేయలేదని, గొంతెత్తకుండా మాత్రం ఉండలేనని స్పష్టం చేశారు. నన్ను ఆర్థికంగా ఇబ్బంది పెడతారని కొంతమంది అంటున్నారు .ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భరిస్తాను . అససరమైతే ప్రజలకోసం జోలె పడతాను తప్ప ఎవరికో లొంగి బతకాల్సిన అవసరం లేదని అందుకు ఈ పొంగులేటి మనసు ఒప్పోకోదని ప్రజల హర్షద్వానాల మధ్య అన్నారు . తప్పు చేస్తే తలదించుకుంటా …చిన్నవారైనా పెద్దవారైనా క్షమాపణలు కొరతా …తప్పులేకుండా శిక్షలు వేయడం ఏ చట్టం చెప్పెందో చెప్పాలని డిమాండ్ చేశారు . అవసరం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని పొంగులేటి అన్నారు .
అధికారం ఉందని అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చేస్తున్న ప్రతి పనికి అనుభవించక తప్పదని, వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.