Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తుమ్మల ఇంటికి మంత్రులు హరీష్ రావు ,పువ్వాడ అజయ్!

తుమ్మల ఇంటికి మంత్రులు హరీష్ రావు ,పువ్వాడ అజయ్!
-18 న ఖమ్మం సభ జయప్రదం కోసం రంగంలోకి దిగిన హరీష్ రావు
-వారి వెంట ఎంపీ నామ ఎమ్మెల్యేలు సండ్ర , మెచ్చా నాగేశ్వరావు
ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి , తాతా మధు
-తుమ్మలకు పెరిగిన ప్రయారిటీ
-కేసీఆర్ సూచనమేరకు తుమ్మలను మంత్రులు కలిసినట్లు సమాచారం
-బీఆర్ యస్ లో జరుగుతున్న పరిణామాలపై క్యాడర్ బిత్తరపోతున్నారు…

ఈనెల 18 ఖమ్మం లో జరుపతలపెట్టిన బీఆర్ యస్ జాతీయసభకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నా ఏర్పాట్లను పరిశీలించేందుకు ఖమ్మం వచ్చిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు సభాస్థలి పరిశీలన అనంతరం మధిర కు వెళ్లారు . అక్కడ జనసమీకరణకోసం సన్నాహక సమావేశం నిర్వహించారు . మంత్రి వెంట జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ , ఎంపీలు నామ ,వద్దిరాజు ,జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ లు ఉన్నారు.

తర్వాత అక్కడ నుంచి నేరుగా గండుగుల పల్లిలోని తుమ్మల నివాసానికి వెళ్లారు . మంత్రులు వెంట ఎంపీ నామ నాగేశ్వరరావు , వద్దిరాజు రవిచంద్ర ,ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య , మెచ్చా నాగేశ్వరావు , ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి , తాతా మధు లు ఉన్నారు . అందరు కలవడం సరదా కబుర్లతో వారి భేటీ నవ్వులు కురిపించింది .అక్కడకు వెళ్లినవారిలో కొందరు అయిష్టంగానే వెళ్లినట్లు తెలుస్తుంది . తన ఇంటికి వచ్చిన అతిధులకు మర్యాద చేయడంలో ముందు ఉండే తుమ్మల వారికీ డిన్నర్ ఏర్పాటు చేశారు . 18 న ఖమ్మంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న బీఆర్ యస్ సభ జయప్రదంలో కీలకంగా వ్యవహరించాలని తుమ్మలను హరీష్ రావు కోరారు . దీంతో తుమ్మల ప్రాధాన్యత మరోసారి పార్టీలో పెరిగింది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న తుమ్మల ఇటీవల పార్టీకి దగ్గరైయ్యే ప్రయత్నం చేస్తున్నారు . రెండు రోజుల క్రితం హైద్రాబాద్ లో జరిగిన కేటీఆర్ మామ హరినాథ్ రావు కర్మ కార్యక్రమంలో సీఎం తో కలిసి పాల్గొన్నారు . తిరిగి మంత్రులు ఇప్పటివరకు తనంటే గిట్టని నేతలు ఇంటికి రావడం తుమ్మల చాణిక్యానికి నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు చెప్పుకుంటున్నారు .

జిల్లాలో ప్రజల్లో పట్టున్న నేతగా ఉన్న మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తిరుగుబాటు బావుటా వేగరవేయడంతో తుమ్మల వచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు . ఇప్పటివరకు కారాలు మిరియాలు నూరిన నేతలు తుమ్మల నివాసానికి వెళ్లడం జిల్లా రాజకీయాల్లో ఆశక్తికర పరిణామంగా చెప్పుకుంటున్నారు . రాజకీయాలు అంటే ఇంతే ఉంటాయని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని క్యాడర్ కూడా చెవులు కోరుకుంటున్నారు . కొందరు అవాక్కు అవుతున్నారు . మరికొందరు బిత్తర పోతున్నారు . మరికొందరు దటీస్ కేసీఆర్ రాజకీయం అంటున్నారు ….ముందు ముందు రాజకీయపరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి …!

Related posts

చర్చల ద్వారానే ఉద్యోగుల సమస్యలు పరిస్కారం …మంత్రులు బొత్స ,బాలినేని!

Drukpadam

షర్మిల మంగళవారం దీక్షలు … మూస పద్దతిలో విమర్శలు…

Drukpadam

యూపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి మౌర్య కాన్వాయ్‌పై దాడి!

Drukpadam

Leave a Comment