Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

12 రోజుల్లో 5.4 సెంటీమీట‌ర్లు కుంగిన జోషిమ‌ఠ్‌.. శాటిలైట్ చిత్రాల విడుదల!

12 రోజుల్లో 5.4 సెంటీమీట‌ర్లు కుంగిన జోషిమ‌ఠ్‌.. శాటిలైట్ చిత్రాల విడుదల!

  • కార్టోశాట్ 2ఎస్ శాటిలైట్ చిత్రాలను విడుదల చేసిన ఇస్రో
  • ఆర్మీ హెలిప్యాడ్ వద్ద భూమి వేగంగా కుంగిపోయినట్టు అంచనా
  • పట్టణంలోని 700 బిల్డింగుల్లో పగుళ్లు

ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం జోషిమఠ్ కుంగిపోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎందుకు జరుగుతోందనే కారణాన్ని కనిపెట్టేందుకు ఇప్పటికే పలు రంగాలకు చెందిన నిపుణులు అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మరోవైపు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కీలక నివేదికను విడుదల చేసింది. డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు అంటే 12 రోజుల్లో జోషిమఠ్ టౌన్ 5.4 సెంటీమీటర్ల మేర కుంగిపోయిందని ఇస్రో తెలిపింది.

దీనికి సంబంధించి కార్టోశాట్ 2ఎస్ శాటిలైట్ తీసిన చిత్రాలను కూడా విడుదల చేసింది. గత ఏడాది 2వ తేదీన జోషిమఠ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. అప్పటి నుంచే అక్కడ నేల కుంగిపోవడం ప్రారంభమయినట్టు అంచనా వేస్తున్నారు. నార్సింగ్ ఆలయం, ఆర్మీ హెలిప్యాడ్ వద్ద భూమి వేగంగా కుంగిపోయినట్టు చెపుతున్నారు. పట్టణంలోని 700 బిల్డింగుల్లో పగుళ్లు వచ్చినట్టు గుర్తించారు.

Related posts

నేనో ఫైల్యూర్ పొలిటిసిన్ ను …అంగీకరించిన పవన్ కళ్యాణ్!

Drukpadam

మనిషికి పంది కిడ్నీ అమర్చిన అమెరికా వైద్యులు!

Drukpadam

వాడీవేడిగా కేఆర్ఎంబీ సమావేశం… వాకౌట్ చేసిన తెలంగాణ

Drukpadam

Leave a Comment