Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నేపాల్ లో కుప్పకూలిన విమానం.. 

నేపాల్ లో కుప్పకూలిన విమానం.. 

  • భారీగా ఎగిసిపడుతున్న మంటలు
  • ప్రమాద సమయంలో ఫ్లైట్ లో సిబ్బందితో సహా 72 మంది
  • ల్యాండింగ్  సమయంలో పొఖారా విమానాశ్రయంలో ఘటన
  • ఎయిర్ పోర్ట్ మూసివేసి సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికారులు

నేపాల్ లో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విమానాశ్రయంలో రన్ వేపై ఓ విమానం కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

దేశ రాజధాని ఖాట్మాండు నుంచి పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్ లైన్స్ విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం రన్ వే పై కూలిపోవడంతో పొఖారా ఎయిర్ పోర్టును అధికారులు మూసివేశారు. విమానంలో ఉన్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం కానీ, ప్రమాదంలో మరణించిన వారి వివరాలను కానీ ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Related posts

దూసుకొచ్చిన బైక్ లు.. జంప్ చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్!

Drukpadam

ఏపీలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు

Drukpadam

డంపింగ్ యార్డ్ వద్ద చెత్త డిస్పోజల్ కు ప్రణాళికలు రూపొందించాలి…. మంత్రి పొంగులేటి

Ram Narayana

Leave a Comment