పవన్ వ్యాఖ్యలు కొత్తగా ఉన్నాయి..ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు!
-స్పష్టత వస్తేనే కత్తులకు పదును వస్తుంది
-రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో భోగి వేడుకలు
-రణస్థలంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన విలేకరి
-పవన్ వైఖరి బట్టే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయన్న ఏపీ బీజేపీ చీఫ్
ఏపీలో ఎన్నికలలకు మరో ఏడాది ఉన్నప్పటికీ ఇప్పటికే పార్టీలన్నీ రాష్ట్రాన్ని ఎన్నికల మూడ్ లోకి తీసుకోని పోయాయి. టీడీపీ , జనసేన పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే బీజేపీ జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి.అందువల్ల జనసేన ,టీడీపీతో కలిసేందుకు ఆశక్తి చూపుతున్న వేళ ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకపక్క కమ్యూనిస్టులు ,మరోపక్క బీజేపీ ,టీడీపీ లు కలిసి పోటీ చేసే అవకాశం ఉందా? అనే సందేహాలు నెలకొన్నాయి దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు .
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు కొత్తగా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యల్లో మరింత స్పష్టత వస్తే అందరి కత్తులకు పదునెక్కుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పవన్ వైఖరికి అనుగుణంగానే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జిల్లా కార్యాలయ ఆవరణలో నిన్న భోగి వేడుకలు నిర్వహించారు. పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
రణస్థలం యువశక్తి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీకి ఆయన దగ్గరవుతున్నట్టుగా అర్థమవుతోందని, దీనిపై మీ అభిప్రాయమేంటన్న ప్రశ్నకు వీర్రాజు స్పందిస్తూ.. పవన్ మాటల్లో మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఆయన వైఖరికి అనుగుణంగానే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని వీర్రాజు అభిప్రాయపడ్డారు.