Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత …మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు!

20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత …మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు!
-గులాబీ పార్టీలో గుబులు సర్యేలో తేలిందంటున్న ఎర్రబెల్లి
-వాళ్ళను మార్చితే 80 నుంచి 90 సీట్లు వస్తాయి
-వరంగల్ , ఖమ్మం జిల్లాల్లో బీజేపీ పెద్ద ప్రభావం చూపకపోవచ్చు
-కాంగ్రెస్ ఖేల్ ఖతం
-మళ్ళీ గులాబీ పార్టీదే అధికారం
-తెలంగాణ దేశానికి రోల్ మోడల్
-కేంద్రం సహకరించకున్న అభివృద్ధిలో దూసుకొని పోతున్నాం

బీఆర్ యస్ సీనియర్ నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ పార్టీ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు . ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలలో 20 మందిని మార్చాలని వరంగల్ లో జరిగిన ఒక సమావేశంలో చెప్పటం ఆసక్తికర పరిణామంగా మారింది .ఇది తన సర్యే లో తెలీని విషయమని కూడా ఆయన కుండబద్దలు కొట్టడం విశేషం .అయితే మార్చాలిసిన ఎమ్మెల్యేలు ఎవరు ఏమిటి అనేది ఆయన వెల్లడించలేదు .మొత్తమీద ఎర్రబెల్లి వ్యాఖ్యలపై గులాబీ పార్టీలో గుబులు పెరిగింది. ఈ సర్యే పై ఆరా తీసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు తమపైనే వేటు పడుతుందని అభిప్రాయంతో తిరిగి టికెట్ కోసం దారులు వెతుకుంటున్నారు .

ఖమ్మం , వరంగల్ , నల్లగొండ జిల్లాల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపదని మంత్రి అభిప్రాయపడ్డారు . ఇక్కడ కమ్యూనిస్టులకు కూడా కొంత ప్రభావం ఉందని అందువల్ల బీఆర్ యస్ ,కమ్యూనిస్టుల పొత్తులో తిరిగి గులాబీ పార్టీ మూడవసారి అధికారంలోకి వస్తుందని ఎర్రబెల్లి విశ్వాసం వ్యక్తం చేశారు . అయితే ఆ 20 మందిని మార్చితేనే 80 నుంచి సీట్లు రావడానికి అవకాశం ఉందనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు .

కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం అయిందని ఇక ఆపార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు . ఇప్పటికే వారు గ్రూపులు పడి కొట్టుకుంటున్నారని ,ఇంకా చెలమంది ముఖ్యనేతలు పార్టీని వీడే అవకాశం ఉందని అన్నారు . దేశంలో కూడా కాంగ్రెస్ అవకాశాలు లేవని ,బీజేపీకి బీఆర్ యస్ ప్రత్యాన్మాయ శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు .

సంక్షేమం ,అభివృద్ధి రెండు కళ్లలా సీఎం కేసీఆర్ తెలంగాణాలో ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నారు . అందువల్లనే కేంద్రం సహకరించకున్నా అభివృద్ధిలో తెలంగాణ దూసుకు పోతుందని దేశంలో కేసీఆర్ పాలన లాంటి పాలన సంక్షేమ కార్యక్రమాలు , అభివృద్ధి కార్యక్రమాలు కావాలని కోరుకుంటున్నారని మంత్రి అన్నారు .

Related posts

జగన్ బెయిల్ రద్దు … చంద్రబాబు జైలుకే…

Drukpadam

వివేకా హత్య కేసులో తనను ఇరికించే ప్రయత్నం ;ఎంపీ అవినాష్ అనుమానం …

Drukpadam

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమపార్టీకి లేదు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి!

Drukpadam

Leave a Comment