జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీ చేయడానికి సిద్ధం: అలీ
పవన్ తనకు మంచి మిత్రుడన్న అలీ
సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని వ్యాఖ్య
వైసీపీ 175 స్థానాలను గెలుచుకుంటుందని ధీమా
రాజకీయాలు సినిమాలు గత కొన్ని శతాబ్దాలుగా కలిసి మెలిసి నడుస్తున్నాయి. గతంలో ఒక్క తమిళనాడుకు మాత్రమే సినిమా స్టార్లు ,రాజకీయాల్లోకి రాగ , తెలుగునాట ఎన్టీఆర్ సంచలనం సృష్టించారు . చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి తనకు రాజకీయాలు సరిపడవని తనపార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు . పవన్ కళ్యాణ్ మాత్రం తన అన్న వెంట వెళ్లకుండా రాజకీయాల్లో కొనసాగుతున్నారు . ఆయన జనసేన పేరుతొ సొంతపార్టీ పెట్టుకుని వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు . అయితే సినిమాల్లో కలిసి నటించిన అలీ , పవన్ కళ్యాణ్ లు వేరు వేరు పార్టీలో ఉన్నారు . దీంతో పవన్ కల్యాణపై పోటీ చేస్తారా ? అని తిరుపతిలో మీడియా ప్రశ్నించగా జగన్ ఆదేశిస్తే తప్పకుండ పోటీచేస్తానని అన్నారు . రాష్ట్రంలో జగన్ మంచి పాలన అందిస్తున్నారని రానున్న ఎన్నికల్లో జగన్ తిరిగి సీఎం కావడం ఖాయమని అన్నారు . అందుకు సీఎం చెప్పినట్లు తాను నడుచుకుంటానని అన్నారు .
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ అన్నారు. అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరని ఆయన చెప్పారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే పవన్ పై వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధమని తెలిపారు.
ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 175 స్థానాలను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఆదేశం మేరకు ఎక్కడైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ చిత్రాల్లో ఒకటి, రెండు మినహా అన్ని సినిమాల్లో అలీ నటించారు. అయితే, గత ఎన్నికల సమయం నుంచీ ఆయన వైసీపీకి అనుకూలంగా మారారు.