Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం జిల్లాకు సీఎం కేసిఆర్ వరాల జల్లు…

ఖమ్మం జిల్లాకు సీఎం కేసిఆర్ వరాల జల్లు…
-ఖమ్మం లో యూనివర్సిటీకి ఒకే అన్న సీఎం
-జిల్లాలో జేఎన్టీయూ ఆధ్వరంలో ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాల
-ఖమ్మం కార్పొరేషన్ కు 50 కోట్లు
-సత్తుపల్లి ,మధిర , వైరా మున్సిపాలిటీలకు 30 కోట్ల చొప్పున నిధులు
-మేజర్ పంచాయతీలకు 10 కోట్ల చెప్పున నిధులు
-జిల్లాలో గ్రామపంచాయతీలన్నింటికీ 10 లక్షల చొప్పున నిధులు
-జర్నలిస్టులకు అందరికి ఇళ్ల స్థలాలు …భాద్యత హరీష్ రావు , అజయ్ లకు అప్పగింత

బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ వరాలు ప్రకటించారు . నేను చెప్పుకునేది తర్వాత చెబుతా ముందు మీ జిల్లాకు ఇవ్వాల్సింది ఇస్తానని చెప్పిన కేసీఆర్ నిధులు ప్రకటించారు . అదే విధంగా మేజర్ పంచాయతీలకు ఒక్కక్కదానికి 10 కోట్ల చొప్పున ప్రకటిస్తున్నట్లు తెలిపారు . దీంతో జిల్లాలోని అన్ని పంచాయతీలకు , కార్పొరేషన్ , మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చనట్లు అయింది.

ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

పెద్దతండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి 10 వేల జనాభాకు మించి ఉండి.. మేజర్‌ గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలకు ఒక్కోదానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

మంత్రి అజయ్ గారి కోరిక మేరకు ఖమ్మం కార్పోరేషన్ అభివృద్ధికి మరొక రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. మున్సిపాలిటీలకు మధిర, వైరా, సత్తుపల్లి కి తలా రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

మంత్రి పువ్వాడ విన్నపం మేరకు ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు.

ఖమ్మం కాల్వొడ్డు మున్నేరు నది పైన పాత వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణం కొరకు సీఎం కేసిఆర్ హామీ ఇచ్చారు . దానికి కావాల్సిన నిధులు మంజూరి చేస్తామన్నారు . ఈ సందర్భంగా ఇనక ఏమైనా ఉన్నాయా అని అడిగారు .దీంతో జర్నలిస్టుల గ్యాలరీ నుంచి బిగ్గర ఇళ్ల స్థలాలు అని నినదించారు. ఏమిటని కేసీఆర్ అరా తీయగా , వెంటనే మంత్రులు హరీష్ రావు , అజయ్ లు కల్పించుకొని ఇళ్ల స్థలాలు అని చెప్పడంతో అందరికి ఇళ్లస్థలాలు ఇస్తామని ఫోటో జర్నలిస్టులకు ,వీడియో జర్నలిస్టులకు ఇస్తామని ఈ భాద్యతను మంత్రులు హరీష్ రావు , అజయ్ లకు అప్పగిస్తున్నట్లు తెలిపారు . నెల రోజుల్లోనే ఇస్తామని అయితే ప్రభుత్వం భూమి ఉంటె చూడండి లేకపోతె ప్రవేట్ భూమి సేకరించి ఇవ్వాలని వారిని సీఎం ఆదేశించారు .

Related posts

తెలంగాణాలో నీటి ప్రాజక్టుల పరిశీలించిన పంజాబ్ సీఎం!

Drukpadam

వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ.. పురందేశ్వరి వివరణ!

Drukpadam

బ్రిటన్ ప్రధాని అధికార నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి!

Drukpadam

Leave a Comment