Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ఎస్ కు జిల్లాలో తిరుగులేదు : వద్దిరాజు

బీఆర్ఎస్ కు జిల్లాలో తిరుగులేదు : వద్దిరాజు
సభను జయప్రదం చేసిన వారందరికీ కృతజ్ఞతలు
సీఎం ఖమ్మం జిల్లా నేతలందరినీ ప్రసంశించారు
కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాం

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను చరిత్రలో నిలిచిపోయేలా.. అంచనాలకు మించి తరలి వచ్చి సక్సెస్ చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. సభ లోపల ఎంత మంది జనం ఉన్నారో.. బయట కూడా అంతే మంది ఉన్నారని.. బయట ఉన్న జనాలకు సభ లోపల ఏర్పాట్లు చేయలేకపోయామన్నారు. సభ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని నిరూపితమైందని అన్నారు. సభకు నాయకులంతా కలిసి కట్టుగా పని చేయడం వల్లనే, సభ దిగ్విజయం అయిందని అన్నారు. ఇదే సమన్వయంతో నాయకులంతా రాబోయో ఎన్నికల్లో పని చేసి పదికి పది అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంటామని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. బీఆర్ఎస్ దేశంలో ప్రభలమైన రాజకీయ శక్తిగా అవతరించడానికి ఖమ్మం సభ దోహదపడుతుందని అన్నారు. సభ నిర్వహణకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు ఎంపీ రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సీఎం కేసీఆర్ ను జిల్లామంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి వెళ్లి కలిశారు .

Related posts

బీఎస్పీ తెలంగాణ అధ్య‌క్షుడిగా ఆర్ఎస్ ప్ర‌వీణ్‌ కుమార్ నియామకం!

Drukpadam

రఘురామరాజును అనర్హుడిగా ప్రకటించండి వైసీపీ…

Drukpadam

ఖబర్దార్ రేణుక చౌదరి పువ్వాడపై ఆరోపణలు చేస్తావా ? టీఆర్ యస్ కు చెందిన ఖమ్మం మేయర్ కార్పొరేటర్లు!

Drukpadam

Leave a Comment