Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

“ముద్ర” మీడియా రంగంలో సరికొత్త ముద్ర వేయాలి …సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి సుభాష్ రెడ్డి …

ముద్రమీడియా రంగంలో సరికొత్త ముద్ర వేయాలిసుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి సుభాష్రెడ్డి
జర్నలిస్టుల ఆధ్వరంలో వస్తున్న ముద్ర గొంతులేని ప్రజల గొంతుకగా ఉండాలి
పక్షపాతంగా వార్తలు వస్తున్న సందర్భంలో నిష్పక్షపాతంగా వార్తలు అందించాలి
ఇదొక కొత్త ప్రయోగం,సాహసోపేతం ఆదరించాలిఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి
ముద్ర ఎవరెస్టు శిఖరంలా ఎదగాలి ,ఎవరెస్టు శిఖరం అధిష్టించిన అన్విత
రంగులు , హంగులు ఉండాలంటే పోషణ శక్తి ఉండాలిదేవులపల్లి అమర్
పత్రిక అంటేనే ప్రతిపక్షం , ముద్ర మీడియా ఆపాత్రను పోషించాలి :ఆర్టీఐ కమిషనర్ కట్ట శేఖర్ రెడ్డి

 

మీడియా రంగంలో కొత్తగా అడుగు పెడుతున్నముద్రసమాజంపై సరికొత్త ముద్ర వేయాలని సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి సుభాష్ రెడ్డి అభిప్రాయం పడ్డారు . డిజిటల్ , వెబ్ , యూట్యూబ్ , ముద్రణ రంగంలో అడుగు పెడుతున్నముద్రసరికొత్త ప్రయోగం సక్సెస్ కావాలని ఆయన అభిప్రాయపడ్డారు . ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ ఎదురుగ ఉన్న కామధేను బిల్డింగ్ లోని ముద్ర కార్యాలయంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మౌంటెనీర్ అన్విత, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, ఏపీ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తో కలిసి ముద్ర దిన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ముద్ర వెబ్ సైట్ ను, ముద్ర యూ ట్యూబ్ చానల్ నూ ప్రారంభించారు.

ప్రస్తుతం పక్షపాతంగా వార్తలు వస్తున్నాయి, ఏది నిజమో ? ఏది అబద్దమో నిర్దారించుకోలేక పోతున్నామని అందువల్ల నిజాలు తెలిపే మీడియా కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆలోటునుముద్రతీర్చాలని ఆకాంక్షించారు . చాలామంది పేదలు ఆధారం లేని వారు న్యాయం కోసం మీడియా , న్యాయస్థానాల వైపు చూస్తుంటారని వారి గొంతుకగాముద్రఉండాలని అన్నారు . జర్నలిజం ఎప్పుడూ సమాజ హితంగానే ఉండాలని,నిష్పక్షపాత పాత్రికేయమే ప్రజలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.సామాజిక స్పృహ కలిగి ఉండే అనుభవజ్ఞులైన పాత్రికేయుల ఆధ్వర్యంలోనే పత్రిక రావడం అభినందించదగిన విషయమని అన్నారు. దశాబ్దాల క్రితంతో పోల్చి చూసుకుంటే మీడియాలో సాంకేతిక పరిజ్ఞానం అత్యున్నతంగా అభివృద్ధి చెందిందన్నారు. అది సరైన రీతిలో ప్రజలకు చేరినపుడే పాత్రికేయుల కృషి ఫలించినట్టు అవుతుందన్నారు. ముద్ర మీడియా హౌస్ అలాంటి కృషిని కొనసాగిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాను అన్ని విధాలా పరిశీలించి సంతృప్తి చెందాకే ప్రారంభోత్సవానికి వచ్చానన్నారు.

ఇది ఒక చాలెంజ్మౌంటెనీర్ అన్విత

మౌంటెనీర్ అన్విత మాట్లాడుతూ జర్నలిస్టులే సభ్యులుగా ఒక మీడియా హౌస్ ను తీసుకురావడం ఒక చాలెంజ్ అని అన్నారు. పట్టుదలతో తాను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లుగానే ఇప్పుడు ముద్ర యాజమాన్యం ముందు అతిపెద్ద టాస్క్ ఉందన్నారు. ఎవరికీ తలొగ్గకుండా సంస్థను ప్రజల పక్షాన నిలపాలని కోరారు.

ఇది ఒక సాహసోపేత నిర్ణయంఅందరు అందరించాలికె .శ్రీనివాస్ రెడ్డి

ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముద్ర మీడియా హౌస్ ప్రారంభం ఒక సాహసోపేతమైన నిర్ణయమన్నారు. ఇప్పటి వరకు పెట్టుబడిదారులు, రాజకీయవేత్తల ఆధ్వర్యంలోనే మీడియా సంస్థలు ఉన్నాయని, జర్నలిస్టులే పెట్టుబడి పెట్టుకుని ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు.

ప్రజలకు చేరువ కావాలిదేవులపల్లి అమర్

ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజల పక్షాన నిలబడటం కూడా ఒక టాస్క్ అన్నారు. ఇపుడు మీడియా కార్పొరేట్ చేతులలో ఉందని, ఇలాంటి పరిస్థితులలో జర్నలిస్టులు కలిసి ఏర్పాటు చేసుకున్న ముద్ర మీడియా త్వరలోనే ప్రజలకు చేరువవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియా సంస్థను నిర్వహించడం ప్రస్తుత పరిస్థితులలో చాలా కష్టంగా మారిందన్నారు.

ఆర్టీఐ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రజల పక్షాన నిలబడాలని, పత్రిక అంటేనే ప్రతిపక్షమని, ముద్ర మీడియా కూడా పాత్రను పోషించాలని సూచించారు. ముద్ర మీడియా ఎండీ సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులు వాటాదారులుగా ఉన్న సంస్థను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ముద్ర మీడియా హౌస్ ఎడిటర్ నరేందర్ రెడ్డి, సీఈఓ విరాహత్ అలీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంద్రారెడ్డి, అసోసియేట్ ఎడిటర్ ఫజుల్ రహమాన్, బ్యూరో చీఫ్ సంపత్, డైరెక్టర్లు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేయడంతో రాజుకు బీపీ …జగన్ కు ఊరట!

Drukpadam

పొంగులేటికి ఊరట.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కౌంటర్‌ ఆదేశం

Drukpadam

జ‌గ‌న్, చిరంజీవిది వ్య‌క్తిగ‌త‌ భేటీ: మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Drukpadam

Leave a Comment