అమెరికాలో చైనా నూతన సంవత్సర వేడుకలు రక్తసిక్తం… దుండగుడి కాల్పుల్లో పలువురి మృతి…
- మాంటెరీ పార్క్ లో లూనార్ ఫెస్టివల్
- తుపాకీతో వచ్చిన దుండగుడు
- విచక్షణరహితంగా కాల్పులు
- 10 మంది మృతి!
- పరారీలో దుండగుడు
అమెరికాలో చైనీయులు జరుపుకున్న తమ దేశ కొత్త సంవత్సర వేడుకలు రక్తసిక్తం అయ్యాయి.కాలిఫోర్నియా రాష్ట్రంలోని మాంటెరీ పార్క్ లో లూనార్ ఫెస్టివల్ చైనీయులు కొత్త సంవత్సర వేడుకలు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నవేళ కాల్పుల కలకలం రేగింది. దీంతో అక్కడ ఉన్నవారంతా బ్రతుకు జీవుడా అంటూ పరుగులు తీశారు .కొంతమంది నేలమీద పడుకున్నారు . అక్కడికి గన్ తో వచ్చిన ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది చైనీయులు చనిపోయినట్లు సమాచారం . ఈ కాల్పుల్లో మరికొంతమంది గాయపడ్డారు . వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు .దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు . ఈ సంఘటనపై చైనా ఆరా తీసినట్లు తెలుస్తుంది.
అమెరికాలో చైనా కొత్త సంవత్సరాది వేడుకల్లో కాల్పుల బీభత్సం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్ నగరంలో చైనీయులు నూతన సంవత్సరం సందర్భంగా లూనార్ ఫెస్టివల్ నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ దుండగుడు తుపాకీతో ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అనేకమంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. 10 మంది మృతి చెందగా, 9 మంది గాయపడినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
మాంటెరీ పార్క్ నగరంలో ఆసియా సంతతి వారు అధికంగా ఉంటారు. మాంటెరీ పార్క్ నగరం లాస్ ఏంజెల్స్ డౌన్ టౌన్ కు 16 కిమీ దూరంలో ఉంటుంది. కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.