Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సంప్రదాయానికి భిన్నంగా ఆర్మీ దుస్తుల్లో బ్రిటన్ రాజు పట్టాభిషేకం !

శతాబ్దాల సంప్రదాయానికి ముగింపు పలకనున్న బ్రిటన్ రాజు ఛార్లెస్!

  • పట్టాభిషేకం సమయంలో రాజ దుస్తులు ధరించడం ఆనవాయతీ
  • పట్టు వస్త్రాలకు బదలు ఆర్మీ యూనిఫాం ధరించాలనుకుంటున్న ఛార్లెస్
  • మే 6న బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేకం

మే 6వ తేదీన బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేకం జరగనుంది. ఈ మహోత్సవంలో శతాబ్దాల సంప్రదాయానికి ఛార్లెస్ దంపతులు స్వస్తి పలకనున్నట్టు తెలుస్తోంది. పట్టాభిషేకం సమయంలో రాజ దుస్తులను ధరించడం ఆనవాయతీగా వస్తోంది. రాజులు పట్టు వస్త్రాలను ధరించేవారు. అయితే ఈ సంప్రదాయాన్ని విడిచిపెట్టాలని ఛార్లెస్ భావిస్తున్నారని తెలుస్తోంది. రాజ దుస్తులకు బదులు ఆర్మీ యూనిఫాంలో పట్టాభిషేకానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది.

లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆ తర్వాతి రోజున విండ్సర్ క్యాజిల్ లో కూడా మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సామాన్యులను కూడా అనుమతించనున్నారు. క్వీన్ ఎలిజబెత్-2 గత సెప్టెంబర్ లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఏడు దశాబ్దాల పాటు ఆమె బ్రిటన్ ను పాలించారు. ఆమె మరణానంతరం బ్రిటన్ రాజుగా ఛార్లెస్ బాధ్యతలను స్వీకరించారు.

Related posts

How to Use Auto AF Fine Tune on Your Nikon DSLR the Right Way

Drukpadam

దేశంలో నరేంద్ర మోదీ రాజ్యాంగం అమలవుతోంది: మంత్రి తలసాని ఫైర్!

Drukpadam

నీరో జగన్.. జనం అల్లాడుతుంటే.. విద్యుత్ కోతలా: చంద్రబాబు

Drukpadam

Leave a Comment