Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం సీపీగా కొల్లు సురేష్ కుమార్!

ఖమ్మం సీపీగా కొల్లు సురేష్ కుమార్ … విష్ణు వారియర్ బదిలీ.. ఆయన స్థానాల్లో సురేష్ కుమార్ గతంలో ఖమ్మం ఏసీపీ గా పనిచేసిన సురేష్ కుమార్ మంచి అధికారిగా పేరు ..డీజీపీ నుంచి ప్రసంశలు ఖమ్మం సీపీ గా కొల్లు సురేష్ కుమార్, ఐపీఎస్ ., 2016 ఐపీఎస్ ., బ్యాచ్ కు చెందిన సురేష్ కుమార్ ఖమ్మం సీపీ గా బదిలీ అయ్యారు. 2010 లో డీఎస్పీ గా గ్రూప్-I లో ఎంపికైన ఈయన గతంలో గూడూరు, మామూనూరు, ఖమ్మం డీఎస్పీ గా, ఖమ్మం రూరల్ ఏసిపి గా పనిచేశారు. 2017 లో అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి పొంది ఖమ్మం అడిషనల్ ఎస్పీ గా భూపాలపల్లి, ములుగు ఓఎస్డీ గా, జగిత్యాల అడిషనల్ ఎస్పీ గా పని చేశారు. 2021 డిసెంబర్ నుండి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ గా ఉంటూ బదిలీపై ఖమ్మం సీపీ గా వచ్చారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ సేవలకు గాను డీజీపీ గా ప్రశంసలు పొందారు. సురేష్ కుమార్ కు ఖమ్మం పై పూర్తీ అవహగానా ఉంది . ఇక్కడ పనిచేసినప్పుడు కూడా ఆయనకు జిల్లాలో మంచి పరిపాల దక్షుడిగా పేరు తెచ్చుకున్నారు . చాల రోజుల నుంచి ఆయన వస్తాడని ప్రచారం జరుగుతుంది. సాధరణ బదీలల్లో భాగంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం సీపీ గా పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్దీ నెలల్లో జరగనుండటంతో ప్రభుత్వం ఐఏఎస్ , ఐపీఎస్ అధికారుల బదీలలను చేపట్టింది. ఖమ్మం నుంచి బదిలీపై వెళుతున్న విష్ణు ఎస్ వారియర్ కూడా మంచి అధికారిగానే కొనసాగారు . తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ ? తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. 50 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. అనధికార సమాచారం మేరకు బదిలీల్లో కరీంనగర్, రామగుండం సీపీలతోపాటు నల్గొండ, సిరిసిల్ల, వనపర్తి, మహబూబ్‌నగర్ ఎస్పీలు ఉన్నారు. ఇక రామగుండం సీపీగా సుబ్బారాయుడు బదిలీ అయ్యారు. మల్కాజిగిరి డీసీపీగా జానకి దరావత్, ఖమ్మం సీపీగా సురేశ్, జగిత్యాల ఎస్పీగా భాస్కర్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజీవ్ రతన్ బదిలీ అయ్యారు.  

Related posts

ప్రపంచంలో అత్యంత మంట పుట్టించే మిరపకాయ ఇదే..!

Ram Narayana

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్…

Drukpadam

ఏపీలో కీలక పరిణామం… సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్ రెడ్డి…

Ram Narayana

Leave a Comment