Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తుమ్మలకు మంత్రి పదవి అంటూ ప్రచారం …సంబరపడుతున్న అభిమానులు!

తుమ్మలకు మంత్రి పదవి అంటూ ప్రచారం …సంబరపడుతున్న అభిమానులు!
-ఖమ్మం బీఆర్ యస్ సభకు ముందువరకు అసంతృప్తితో ఉన్న తుమ్మల
-హరీష్ రావు తుమ్మల ఇంటికి వెళ్లడంతో మారిన సీన్
-కేసీఆర్ కలిసి పనిచేద్దామన్నాడని ప్రచారం
-ఇంకా పాలేరు సీటుపైనే గురి …
-ఎమ్మెల్సీ అయినా ఇచ్చే అవకాశం ఉందా?

సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రయాణం పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పార్టీపై కీనకగా ఉన్న సీనియర్ నేతను మంత్రి హరీష్ రావు వచ్చి లైన్లోకి తెచ్చారు. అయితే ఆయనకు మంత్రి పదవి వస్తుందంటూ పుకార్లు ,షికార్లు చేస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు సంబరపడి పోతున్నారు . ఇలాంటి పుకార్లు జరగటం తుమ్మల విషయంలో కొత్త కాకపోయినా ,ఈసారి ఎన్నికలు తొందరలో ఉండటం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారతారని ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా తుమ్మలను దగ్గరకు తీసి మంత్రి పదవి ఇస్తారని సోషల్ మీడియా లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇది నిజమేనేమో అన్నంతగా వార్తకు బలం చేకూర్చే వాదనలు పెడుతున్నారు . దీంతో తుమ్మల అనుయాయులు మురిసి పోతున్నారు . ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజయ్ మంత్రిగా ఉన్నారు . తుమ్మల కు మంత్రి ఇవ్వాలంటే అజయ్ ని తియ్యాలి . అజయ్ అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలిచారని సీఎం నే స్వయంగా చెబుతున్నారు . అలాంటపుడు ఒకే సామజిక వర్గానికి ఒకే జిల్లా నుంచి రెండు మంత్రి పదవులు ఇవ్వడం అనేది సాధ్యం అయ్యేపని కాకపోవచ్చు . ఇప్పటికే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కు టీడీపీ నుంచి టీఆర్ యస్ లో చేరే సందర్భంగా ఇస్తానన్న మంత్రి పదవి ఇవ్వలేదు . సండ్రకు కూడా ఎస్సీలలో మంచి పట్టు ఉంది మంచి మాటకారి ,మాదిగ సామజిక వర్గానికి మంత్రు వర్గంలో చోటు లేదనే అసంతృప్తి ఉంది. అందువల్ల ఇస్తే గిస్తే సండ్రకు చోటు ఉంటుంది తప్ప ,తుమ్మలకు ఛాన్స్ ఉండగా పోవచ్చునని పరిశీలకుల అభిప్రాయం.

రాజకీయాల్లో కేసీఆర్ తో సమానమైననేతగా ఉన్న తుమ్మల కాలం కలిసి రాక రాజకీయాల్లో ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్న తుమ్మల కు కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు . గత ఎన్నికల్లో మంత్రిగా ఉండి తుమ్మల ఓడిపోయడంపై ఆగ్రహంగా ఉన్నారు . నాటినుంచి కేసీఆర్ కనీసం తుమ్మలకు ఇంటర్య్వూ కూడా ఇవ్వలేదు .

తుమ్మల గులాబీ పార్టీలో చేరిన తర్వాత జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 కి 10 అసెంబ్లీ సీట్లు తమ ఖాతాలో పడతాయని కేసీఆర్ అనుకున్నారు . కానీ అందుకు విరుద్ధంగా చివరకు తుమ్మల ఓడిపోవడం సీఎం కేసీఆర్ ను సైతం షాక్ కు గురిచేసింది. 2018 ఎన్నికల్లో ఒకే ఒక్కడుగు గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ మంత్రి అయ్యారు .తన ఓటమిలో సొంతపార్టీ నేతలే కీలకంగా వ్యవరించారని తుమ్మల భావించారు .తనకన్నా జూనియర్ గా ఉన్న అజయ్ మంత్రి కావడం పట్ల అసహనంగా ఉన్నారు .తన సీనియారిటీ దృష్టిలో పెట్టుకొని తనకు గతంలో లాగా మంత్రిపదవి ఇస్తారని ఆశించారు . కానీ అది జరగలేదు.

పైగా తనపై కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి గులాబీ గూటికి చేరారు . దీంతో నియోజకవర్గంలో కందాల మాట చెల్లుబాటు కావడం తో తుమ్మల తట్టుకోలేక పోయారు . అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తాను పాలేరు లో తిరిగి పోటీచేస్తానని బహిరంగంగానే చెబుతున్నారు . దీంతో కందాల ,తుమ్మల మధ్య నియోజకవర్గంలో ప్రత్యన్నయుద్ధం జరుగుతుంది. బీఆర్ యస్ లో రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు . చివరికి పోలీస్ స్టేషన్ వరకు కేసులు వెళ్లాయి.

బీఆర్ యస్ టికెట్స్ ను తిరిగి సిట్టింగ్ లకు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంతో కందాల తనకే టికెట్ అనుకుంటున్నారు .అయితే ఖమ్మంలో జరిగిన బీఆర్ యస్ సభ సందర్భంగా పార్టీకి దూరంగా ఉంటున్న తుమ్మలను ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు బుజ్జగించారు . బీఆర్ యస్ ఖమ్మం సభ సందర్భంగా అక్కడే మకాం వేసిన హరీష్ రావు జిల్లాపార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలను సరిదిద్దే ప్రయత్నం చేశారు . పార్టీలోని ఎడమొఖంపెడ ముఖం ఉన్నవాళ్లను అందరిని దగ్గరకు చేర్చారు . వివిధ నియోజకర్గాల పర్యటనల్లో వారిని పాల్గొనేలా చేశారు . అయితే ఇది తాత్కాలిక ఐక్యతనా ? పర్మినెంట్ ఐక్యతా అనే అంటే . తాత్కాలికమే అంటున్నారు పరిశీలకులు . ఖమ్మం లో బీఆర్ యస్ పార్టీ పైకి బలంగా కనిపిస్తున్న లోపల అంట సీన్ లేదు .రెండు మూడు నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో గ్రూప్ తగాదాలు ఇలానే కొనసాగితే పార్టీ ఇబ్బందులను ఎదురుక్కోక తప్పదు మరి …!

 

Related posts

బీజేపీ ఎంపీ అర్వింద్ సోదరుడు కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం

Drukpadam

చంద్రబాబు ఎత్తుగడలు ఇక పారవు ఆయనతో బీజేపీ కలిసే ప్రసక్తేలేదు : సునీల్ దేవధర్!

Drukpadam

మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కవితకు 91 సీఆర్పీసీ కింద నోటీసులు!

Drukpadam

Leave a Comment