Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మరోసారి రిపబ్లిక్ డే సాక్షిగా తెలంగాణలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం !

మరోసారి రిపబ్లిక్ డే సాక్షిగా తెలంగాణలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం !
-గవర్నర్ రిపబ్లిక్ డే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరం
-గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్‌రాజ‌న్‌పై మండిప‌డ్డ మంత్రి తలసాని ఎమ్మెల్సీ క‌విత‌
-రిపబ్లిక్ డే ప్రసంగంలో సీఎం కేసీఆర్ పై గవర్నర్ పరోక్ష విమర్శలు
-కొందరికి ఫామ్ హౌస్ లు ఉండటం కాదు.. అందరికీ ఇళ్లు ఉండాలన్న గవర్నర్
-అభివృద్ధి అంటే కొత్త బిల్డింగులు కట్టడం కాదని విమర్శ

రిపబ్లిక్ డే సందర్భంగా ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరోక్ష విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కరోనా క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వం డిమాండ్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

కేవలం కొందరి సంపదను పెంచడంపై కాకుండా… రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్రంపై తాము పోరాడుతున్నామని చెప్పారు. ఎప్పటి నుంచో కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే ఈరోజు గవర్నర్ ప్రస్తావించారని… ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎద్దేవా చేశారు.

ఈరోజు గవర్నర్ మాట్లాడుతూ… కొందరికి ఫామ్ హౌసులు ఉండటం కాదని… అందరికీ నివసించడానికి ఇళ్లు ఉండాలని అన్నారు. అభివృద్ధి అంటే కొత్త బిల్డింగులు కట్టడం కాదని… దేశాన్ని నిర్మించడమని చెప్పారు. జాతీయ రహదారులు, వందేభారత్ తదితర అంశాలకు సంబంధించి ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.

గ‌వ‌ర్న‌ర్‌పై మంత్రి త‌ల‌సాని ఫైర్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం బాధాకరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. గవర్నర్ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలగజేసుకోవాల్సిన అవసరం ఉందని… ఆమెకు లేఖ రాస్తామని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉంటూ… ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని చెప్పారు.

Related posts

నల్లారి, సినీ నటుడు మోహన్ బాబు బీజేపీ వైపు చూస్తున్నారా …?

Drukpadam

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ….?

Drukpadam

పేదల భాదలు వింటూ ,రైతుల కష్టాలు తెలుసుకుంటూ పీపుల్స్ మార్చ్ లో ముందుకు సాగుతున్నభట్టి…

Drukpadam

Leave a Comment