మొఘల్ గార్డెన్ పేరు మార్పు ….బీజేపీ మార్క్ రాజకీయం..!
-అమృత్ ఉద్యాన్ గా మార్చిన కేంద్రం..ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
-వందల సంవత్సరాలుగా మొఘల్ గార్డెన్ కు ఎంతోపేరు
-ప్రపంచలోని ప్రముఖ దేశాధినేతలు సందర్శించిన ప్రదేశం
-ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మొఘల్ గార్డెన్స్ కు కొత్త పేరు
-ప్రజల సందర్శనకు జనవరి 31 నుంచి అనుమతి
-ప్రజల అభివృద్ధి లేకుండా పేర్లు మార్పు హాస్యాస్పదం
మొఘల్ గార్డెన్ …రాష్ట్రపతి భవనంలోని ఒక ప్రత్యేకమైన ప్రదేశం పేరు …ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఉంటుంది.అందమైన ప్రదేశం ఆహ్లదకరమైన వాతావరణం .రాష్ట్రపతి భవనంలోని మొఘల్ గార్డెన్ అనగానే అక్కడకు వెళ్ళినవారు దాన్ని చూడాలని కుతూహల పడుతుంటారు . మనదేశం అనేక సంస్క్రుతులకు , భాషలకు ,ప్రాంతాలకు నిలయం… కులమతాలు అనేకం … ఒకపక్క గ్రామీణ భారతం..మరోపక్క సంపన్న భారతం హెచ్చుతగ్గులు , వ్యత్యాసాలు అనేకం .అందుకే మనదేశం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకుంటాం .అందరికి గౌరవించడం మన భారతీయుల గొప్ప సంప్రదాయం . పేరు ఏదైనా ప్రజలకు మేలుచేసే సమాజం కావాలని కోరుకుంటాం …అందుకనే మనది సామ్యవాద లౌకిక రాజ్యాగం అని రాసుకున్నాం . ప్రజలకు కుడు ,గూడు , గుడ్డ దొరికే సమాజం వైపు అడుగులు వేయాల్సిన మన పాలకులు గతంలో ఉన్న పేర్లను తొలగించి కొత్త పేర్లు పెట్టి వాటినే ప్రగతిగా చెప్పుకొవడం హాస్యాస్పదం …
రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్స్ అందాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధికెక్కాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం మొఘల్ గార్డెన్స్ పేరు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రఖ్యాత ఉద్యానవనం పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చింది.
75 వసంతాల స్వతంత్ర భారతావనిని దృష్టిలో ఉంచుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యాచరణను చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం… అందుకు అనుగుణంగానే మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చినట్టు తెలుస్తోంది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదం తెలిపారు.
ఇకపై సరికొత్త నామధేయంతో కొనసాగనున్న ఈ ఉద్యానవనాన్ని ద్రౌపది ముర్ము రేపు ప్రారంభించనున్నారు. కాగా, ప్రజల సందర్శన నిమిత్తం ఈ అమృత్ ఉద్యాన్ ను జనవరి 31 నుంచి మార్చి 26 వరకు తెరిచి ఉంచుతారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ఉద్యానవనం పూర్తిగా వికసించిన రంగురంగుల పువ్వులతో ఆహ్లాదకరంగా ఉంటుంది.