Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గవర్నర్ విషయంలో కేసీఆర్ సర్కార్ వెనకడుగు …కేసు ఉపసంహరణ !

గవర్నర్ విషయంలో కేసీఆర్ సర్కార్ వెనకడుగు …కేసు ఉపసంహరణ !
-బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం
-గవర్నర్ తో మంత్రులు హరీష్ రావు , ప్రశాంత రెడ్డి భేటీ
-హైకోర్టులో గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం పై వాదోపవాదనలు
-రాష్ట్రప్రభుత్వం తరుపున సుప్రీం కోర్ట్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు
-ఇది రాజ్యాంగబద్ద విషయం రెండు వర్గాలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించిన హై కోర్ట్ చీఫ్ జస్టిస్
-హైకోర్టు సీజే సూచన మేరకు ఒక అంగీకారానికి వచ్చిన ఇరు వైపుల న్యాయవాదులు …

 

నిరంతరం కేంద్రంపై , రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవస్థపై విమర్శలు గుప్పిస్తున్న కేసీఆర్ వెనకడుగు వేశారు . శాసనసభ ప్రారంభంగా సంప్రదాయంగా ఉంటున్న గవర్నర్ ప్రసంగానికి అనుమతి ఇచ్చారు . రాష్ట్ర హైకోర్ట్ ఇచ్చిన డైరక్షన్ మేరకు ఇరు పక్షాల న్యాయవాదులు చర్చలు జరిపి జటిలంగా మారిన ప్రగతిభవనం ,రాజ్ భవనం లమధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేసేశారు . అంతకు ముందు గవర్నర్ తన స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం పూనుకోవడంతో బడ్జెట్ కు రాజ్యాంగం ప్రకారం ఆమోదం తెలపాల్సిన గవర్నర్ ఆమోదం తెలపలేదు . దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రహైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దువే వాదనలు వినిపించారు. చివరకు చీఫ్ జస్టిస్ ప్రభుత్వం …గవర్నర్ విషయంలో వచ్చిన వివాదం పై ఇరువైపులా న్యాయవాదులు ఒక అంగీకారానికి రావాలని సూచించారు . అందుకు సమ్మతించిన న్యాయవాదులు చివరకు రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించి రాష్ట్ర గవర్నర్ ను బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఆహ్వానించాలని నిర్ణయించారు .దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రులు హరీష్ రావు , ప్రశాంత రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లి బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించారు . అందుకు ఆమె సమ్మతించారు . దీంతో సమావేశాలకు లైన్ క్లియర్ అయింది . అయితే సమావేశాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలా లేక ఇదే సరిపోతుందా అనేదానిపై న్యాయనిపుణులు , ప్రభుత్వ అదిఆకారులు చర్చలు జరుపుతున్నారు .

Related posts

కారణజన్ముడు సీఎం కేసీఆర్ : ఎంపీ నామ నాగేశ్వరరావు…

Drukpadam

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం.. ప్రదర్శన ఇచ్చిన కాసేపటికే విషాదం!

Drukpadam

టీటీడీలో బ్రాహ్మ‌ణ వ్య‌తిరేక శ‌క్తులు ఉన్నాయి: ర‌మ‌ణ దీక్షితులు

Drukpadam

Leave a Comment