Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీలో పేదోడికి ,పెత్తందార్లకు మధ్య యుద్ధం:సీఎం జగన్ …!

ఏపీలో  పేదోడికి ,పెత్తందార్లకు మధ్య యుద్ధం:సీఎం జగన్ …!
-కుల పోరాటాలు కాదు …వర్గపోరాటాలు…
-ఒక పక్క పేదలు…మరో పక్క సంపన్నలు..
-మాట ఇస్తే తప్పని రాజకీయాలు ఒకేవైపు
-వెన్నుపోట్లు , మోసం మరోవైపు
-ఎన్నికల్లో ఎవరితో పొత్తుల్లేవు …సింహం సింగిల్ గానే వస్తుంది
-తోడేళ్ళు అన్ని కలిసి కట్టకట్టుకుని వస్తున్నాయి
-ఎంతమంది కలిసి వచ్చిన దేవుడి దయ …ప్రజల దీవెనలు ఉన్నత కాలం మీ బిడ్డ భయపడడు …

ఏపీలో ఎన్నికలకు మరో 16 నెలల సమయం ఉంది . కానీ ఎప్పటినుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా టీడీపీ , జనసేన కలిసి ఎన్నికల్లో పోటీచేస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పల్నాడులో పర్యటించిన సీఎం జగన్ ప్రతిపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు . ఎన్నికల్లో పోటీకి తోడేళ్ళన్నీ కలిసి వస్తున్నాయి. సింగల్ గా పోటీచేసే దైర్యం వారికీ లేదు .తాము మాత్రం సింహంగా లాగా సింగల్ గానే వస్తామని ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు . ఏపీ లో జరుగుతున్న యుద్ధం కులాల మధ్య కాదు . వర్గాల మధ్య జరుగుతున్నాయి. ఒకపక్క పేదలు ,మరోపక్క సంపన్నుల మధ్య యుద్ధం జరుగుతుంది . దీనిపై ప్రజలు ఆలోచన చేయాలి . దేవుడి దయ ,ప్రజల దీవెనలతో ఇచ్చనమాట నెరవేర్చి మీ ముందుకు వస్తున్నారు . అదే సందర్భంలో మరో పక్క వెన్నుపోటు దార్లు , మోసం చేసేవాళ్ళు వస్తున్నారు . దాచుకో ,దోచుకో , తినుకో అనేవారు అధికారం కోసం అబద్దాలు చెబుతున్నారు . మీ బిడ్డ చెప్పిన కట్టుబడి సింహంలా తోడేళ్ళను ఎదుర్కొంటున్నారు . ఎవరికీ భయపడడని అన్నారు . దేవుడి దయ , మీ అండదండలు ఉన్నంతకాలం ఎవరినానైనా ఎదిరించి నిలబడతానని పేర్కొన్నారు .

రాష్ట్రం జీడీపీ లో 11 .43 శాతం తో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది . ఒక్క బటన్ నొక్కి పేదలకు సహాయం అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు . ప్రజల చేతుల్లోకి నేరుగా డబ్బులు అందించి వారి కొనుగోలు శక్తిని పెంచామని అన్నారు . ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజల మేలుకోసం పనిచేసి వారికీ అండగా నిలిచిన మీ బిడ్డకు అండగా ఉండాలని జగన్ పిలుపు నిచ్చారు . నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి , వైద్యం పేదలకు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం తమదే నన్నారు . వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు . గ్రామసచివాలయాలు , వలంటీర్ల నియామకం దేశంలో మరెక్కడాలేదని సీఎం జగన్ అన్నారు . సభకు భారీగా ప్రజలు తరలి వచ్చారు .

 

Related posts

ముస్లిం వ్యతిరేక ముద్రను చెరిపేసుకునేందుకు బీజేపీ వ్యూహాలు!

Drukpadam

ఈ నెల 23 వరకు కేసీఆర్ కు టైమ్ ఇస్తున్నాం: రేవంత్ రెడ్డి

Drukpadam

పేదల భాదలు వింటూ ,రైతుల కష్టాలు తెలుసుకుంటూ పీపుల్స్ మార్చ్ లో ముందుకు సాగుతున్నభట్టి…

Drukpadam

Leave a Comment