కోవర్టుల మాటలపై బీజేపీలో వార్ …ఉలిక్కి పడ్డ రాములమ్మ …!
-అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవర్టులన్న ఈటల మాటలపై దుమారం
-కోవర్టులు ఉంటె బయటపెట్టమన్న రాములమ్మ
-కేసీఆర్ ఎదుటి వారి బలహీనతలు ఉపయోగించు కుంటారు
-స్వతహాగా తాను బలపడే శక్తి ఆయనకు లేదు
-గత ఎన్నికల్లో తాజ్ హోటల్ లో ఏమి జరిగిందో చెప్పమంటారా ?
-కేసీఆర్ వి అన్ని మోసం దగా , కుట్రలు కుతంత్ర రాజకీయాలు
అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని బీజేపీ నేత మాజీమంత్రి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు బీజేపీలో ప్రకంపనలు సృష్టించాయి . దీనిపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఉలిక్కిపడ్డారు . కోవర్టులు ఉంటె ఆయన్నే చెప్పమనండి …మంచిదే కదా ? వారి పేర్లు బయట పెట్టమనండి …జాగ్రత్త పడటానికి ఉపయోగపడుతుంది. అంతేకాని ఊరికే అంటే సరిపోదు …అసలు కోవర్టులు ఉన్నారని నేను అనుకోవడంలేదని కూడా ఆమె అన్నారు .కోవర్టులు ఉంటె చెప్పమనడం వరకు ఒకే …అదికూడా బహిరంగంగా చెప్పమని అంటే పొరపాటే అవుతుంది. ఆమె సరైన సమయంలో సరైన వేదిక మీద చెప్పమని అడగటంలో తప్పులేదు . వారి పేర్లు చెప్పమనండి …అంటూనే అసలు కోవర్టులు లేరని సర్టిఫికెట్ ఎలా ఇస్తారు అనేది ? అసలు ప్రశ్న ? విజయశాంతి అన్నమాటలు కేసీఆర్ ను సమర్థించినట్లుగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి .ఒకవేళ ఈటల దగ్గర ఎలాంటి సమాచారం ఉందో తెలుసుకుంటానంటే ఇబ్బంది ఉండేదికాదు ..ఆలా కాకుండా తమ పార్టీ నేతపై బహిరంగంగా విమర్శలు చేయడం పార్టీలో ఉన్న నిర్మాణ రాహిత్యాన్ని తెలియజేస్తుంది . ఇది పార్టీ నేతల మధ్య యుద్ధవాతావరణానికి అద్దం పడుతుంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అంటున్న బీజేపీలో ఇలాంటి పరిణామాలు నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం . ఇప్పటికే బీజేపీలో చేరిన నేతలుపార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు . కొందరు ఇబ్బందిగా ఫీలౌతున్నారని తెలుస్తుంది .
టీఆర్ యస్ లో అన్ని పార్టీల కోవర్టులు ఉన్నారనేది ఎప్పటినుంచే తెలుగునాట మార్మోగుతున్నమాట … ఈటల ఈరోజు కొత్తగా అంటుంది కాదు .చేరికల కమిటీ చైర్మన్ గా ఆయన కొంతమందిని ఇతర పార్టీలనుంచి బీజేపీలోకి తీసుకోని వద్దామని ప్రయత్నిస్తున్నారు . ఆవిషయం ముందే లీకు అవుతుందని ఆయన భావిస్తున్నారు . చాలాకాలం కేసీఆర్ తో కలిసి ప్రయాణం చేసి ఆయన ఎత్తులు జిత్తులు తెలిసిన ఈటల రాజేందర్ నోట కోవర్టుల మాట చెప్పడంతో దీనికి బలం చేకూరింది . కేసీఆర్ తాను బలపడాలంటే ఎదుటివారి బలహీనతలను ఉపయోగించు కుంటారు తప్ప స్వతహాగా తనుబలపడేంత శక్తి ఆయనలో లేదని ఈటల మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ గా మారాయి . అందుకు అనేక విషయాల్లో తానే ప్రత్యక్ష సాక్షిని అనికూడా చెప్పారు . గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాజ్ హోటల్ లో ఏమి జరిగిందో చెప్పమంటే చెపుతా అనుకూడా బాంబు పేల్చారు . కేసీఆర్ వి అన్ని మోసం దగా , కుట్రలు కుతంత్ర రాజకీయాలు అని ఈటల అంటున్నారు . అందువల్లనే కేసీఆర్ కు అన్ని పార్టీల్లో కోవర్టులు ఉన్నారని చెప్పడం తప్పు ఎలా అవుతుందో బీజేపీలేదా విజయశాంతి చెప్పాలి … లేకపోతె రెండు పార్టీలకు ఎదో సంబంధం ఉందని కొన్ని పార్టీలు చెస్తున్న ఆరోపణలు నిజం చేసినవారు అవుతారు …
కేసీఆర్ భారత రాష్ట్రసమితి పేరుతో పార్టీ పెట్టారు . పార్టీ పెట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు .కానీ పార్టీ పెట్టడానికి ఎంచుకున్న మార్గంపై ప్రజల్లో రాజకీయ పార్టీల్లో సందేహాలు ఉన్నాయి. పార్టీకి ఎజెండా లేదు . పార్టీ రాజ్యాంగాన్ని ప్రకటించలేదు . దేశ స్థాయిలో కమిటీ లేదు … ఆయన స్టైల్లో కోవర్టులు పెట్టుకోవచ్చు …అదికూడా రాజనీతిలో భాగమే …ఎదుటివారి బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకోవడం ఎత్తుగడల్లో భాగమే కేసీఆర్ పరంగా చూస్తే తప్పు పెట్టాల్సిన పనిలేదు . అయితే పార్టీ నిర్మాణంపైనా ఇంకా ద్రుష్టి సారించినట్లు లేదు .