Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఎమ్మెల్సీ తాతా మధు ఫైర్!

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఎమ్మెల్సీ తాతా మధు ఫైర్!
-కలుషిత, ధన రాజకీయాలను చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు సహించరు
-మా ఓపికను చేతగాని తనంగా తీసుకోవద్దని హెచ్చరిక
-డబ్బు రాజకీయాలు చేస్తే ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం
-ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ పై ఉమ్మి వేయడం అంటే సూర్యుడిపై వేయడం లాంటిది
-ఉచిత విద్యత్ తప్పుడు ప్రచారం మానుకో …లేదా బహిరంగ విచారణకు సిద్ధంగా ఉండు
-పార్టీ ద్వారా ఆర్థిక లబ్ది పొంది …అదే డబ్బుతో పార్టీ అభ్యర్థులను ఓడించిన చరిత్ర నీది …
-పొంగులేటి పార్టీలో సభ్యత్వం ఉందో లేదో తెలియదు
-పక్క చూపులు చూస్తున్న పొంగులేటి
-ఆర్థికంగా లబ్ధికోసమే గులాబీ పార్టీలో చేరాడని ఆరోపణలు

ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ ను నష్టపరచాలని , తన సొంత ఎజెండాతో ముందుకు పోతున్నమాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆటలు సాగనివ్వమని ఖమ్మం జిల్లా బీఆర్ యస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు హెచ్చరించారు . మంగళవారం జిల్లా బీఆర్ యస్ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి చర్యలు ,చేష్టలపై మధు ఫైర్ అయ్యారు . ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అడ్డగోలుగా మాట్లాడుతున్న శ్రీనివాస్ రెడ్డి చర్యలను పార్టీ శ్రేణులు ఎక్కడిక్కడ ఖండించాలని పిలుపు నిచ్చారు . నోరుందికదా? డబ్బులతో జనం వస్తున్నారు కదా? అని పార్టీ పై పొంగులేటి ఇష్టానుసారం మాట్లాడితే సహించేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు . రైతులకు రుణమాఫీ చేయలేదని , 24 గంటల ఉచిత విద్యత్ అందడంలేదని అబద్దాలు చెప్పడం దారుణమని అన్నారు . నారాయణపురం లోని శ్రీనివాస్ రెడ్డి 40 ఎకరాల మామిడి తోటకు ఉచిత విద్యుత్ అందటం లేదని నిరూపిస్తానంటే మీడియా మిత్రులతో బహిరంగ చర్చకు వస్తానని , అందుకు ఆయన సిద్దమేనా అని మధు సవాల్ చేశారు . కోట్ల రూపాయలకు అధిపతి వైన నీవు ఒక్కపైసా అయినా కరెంట్ బిల్లు కడుతున్నావా? కరెంటు వస్తుందా? లేదా? అన్న విషయమై నేను కల్లూరు వస్తా.. వెళ్దామా ? నీకు కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు తీసుకుంటున్నావా లేదా ? చెప్పాలని డిమాండ్ చేశారు .

ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యం కలిగింది . అనేక ఉద్యమాలకు నిలయం . ఇక్కడ ప్రజలు రాజకీయాలను కలుషితం చేస్తే సహించరని గుర్తుంచుకోవాలని అన్నారు ..ధన రాజకీయలను ప్రోత్సహిస్తున్న పొంగులేటి కి.. రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లా ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు . బిఆర్ఎస్ పార్టీ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొంది అన్ని ఎన్నికలలో అదే డబ్బుతో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమైంది నిజం కదా ? అని మధు ప్రశ్నించారు .

బిఆర్ఎస్ పార్టీలో పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి సభ్యత్వం ఉందో.. లేదో.. తెలియదు. ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు .. సభ్యత్వం ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు తప్పకుండ తీసుకుంటుందని తెలిపారు .

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాల కారణంగానే వివిధ పార్టీల నుంచి అనేక మంది బీఆర్ఎస్ లో చేరారని, అంతేగానీ తన వల్లే ఖమ్మం జిల్లాలో చేరికలు జరిగాయని, పార్టీ పటిష్టంగా మారిందని పొంగులేటి అనడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు . శ్రీనివాస్ రెడ్డి తన స్థాయి కంటే ఎక్కువగా ఊహించుకుంటున్నాడని, రాజకీయ పరిపక్వత లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నడని తాతా మధు దుయ్యబట్టాడు.

కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, బీఆర్ఎస్ లలో రాజకీయ పబ్బం గడుపుకుని, ఇప్పుడు పొంగులేటి పక్కచూపులు చూస్తున్నాడని తాతా మధు దుయ్యబట్టాడు. పొంగులేటికి రాజకీయ స్టెబిలీటీ లేదని, డబ్బుతోటి దేన్నయినా కొనవచ్చనే ఆలోచనలో ఉన్నాడని విమర్శించాడు.

షర్మిల – బండి సంజయ్ మాటలు వల్లేవెస్తున్న పొంగులేటి
బండి సంజయ్, షర్మిల మాటలు, ఆయన మాటలు ఒకే తీరుగా ఉంటున్నాయని, అందుకే బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నావని అన్నారు .

నియోజకవర్గాల్లో తిరగాలంటే పాస్ పోర్టు, విసా కావాలా? అని పొంగులేటి మాట్లాడుతున్నారు .. షర్మిల లాగా పొంగులేటి కూడా మాట్లాడుతున్నాడు. ఇద్దరు కుమ్మక్కు అయి బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు .

వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీకి నష్టం చేశావని, ‘నచ్చితే గెలిపిస్తా.. నచ్చక పోతే ఓడిస్తా’ అనే పాలసీని పెట్టుకుని పార్టీకి చాలా నష్టం చేశావని, వివిధ ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థుల ఓటమికి ప్రత్యక్ష కారణం పొంగులేటి అని తాతా మధు ధ్వజమెత్తాడు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినా ఎందుకు గెలువలేదని? వారి ఓటమికి ఎవరు కారణమని మధు ప్రశ్నించారు .

వ్యక్తిగత స్వార్ధం తోనే గులాబీ పార్టీలోకి … ఆధారాల ఉన్నాయి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీలో చేరాడని, పార్టీ నుంచి వ్యక్తిగతంగా అనేక రకాలుగా లబ్ధి పొందాడని తాత మధు ఆరోపించారు . సమయం వచ్చినప్పుడు అన్ని ఆధారాలతో బహిర్గతం చేస్తామని చెప్పాడు. 2014 కు ముందు నీ ఆర్థిక స్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి? బీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా మిగతావారికి డబ్బు సహాయం చేయడం, మాట సహాయం చేయడం పొంగులేటి పరిపాటిగా మారిందని, ఈ క్రమంలోనే పార్టీ తనకు అన్యాయం చేసిందని గగ్గోలుపెట్టడం తన అహంకారానికి నిదర్శనం అని అన్నారు . తనవల్లనే పార్టీ అభివృద్ధి చెందితే తన మనుషులు ఎందుకు ఓడిపోయారో చెప్పాలన్నారు . జిల్లాలో పార్టీ తలుచుకుంటే తిరగగలవా అని సవాల్ చేశారు . శీనన్న బ్రాండ్ ,శీనన్నజనం అంటూ వీర్ర విగడం  తనపతనానికి నాంది అని పొంగులేటిపై వ్యంగ్యబాణాలు విసిరారు . పార్టీ అధిష్టానం పొంగులేటి కుట్రలను అర్థం చేసుకున్నదని, జిల్లా నాయకత్వం అంతా నీ కుట్రలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ఉందని కుట్రలు,కుతంత్రాలను తిప్పికొడతామని అన్నారు .

ఈ మీడియా సమావేశంలో జెడ్పి చైర్మన్ కమల్ రాజు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం , నగర మేయర్ నీరజ , రాష్ట్ర విత్తన అభివృద్ధి చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , జిల్లా యువజన అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు .

Related posts

కోనసీమ అల్లర్ల కేసుల విషయంలో జగన్ కీలక నిర్ణయం!

Drukpadam

మోడీ పదిలక్షల ఉద్యోగాలు వట్టి భూటకం…రాహుల్ ధ్వజం!

Drukpadam

మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం రండి.. జగన్, చంద్రబాబు, పవన్ సహా 37 పార్టీల అధినేతలకు స్టాలిన్ లేఖ!

Drukpadam

Leave a Comment