Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విశాఖే రాజధాని సీఎం జగన్…నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నా…!

నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నా… మీరు తప్పకుండా రండి: సీఎం జగన్! 

  • ఢిల్లీలో ప్రపంచ పెట్టుబడిదారుల సన్నాహక సమావేశం
  • హాజరైన ఏపీ సీఎం జగన్
  • అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం ఏపీ అని వెల్లడి
  • రాష్ట్ర వృద్ధిరేటు 11.43 శాతం అని ఉద్ఘాటన

ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సన్నాహక సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. వివిధ దేశాల దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరైన ఈ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం ఏపీ అని స్పష్టం చేశారు. రాష్ట్ర జీఎస్డీపీ 11.43 శాతం అని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా తమదే అగ్రస్థానం అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఏపీలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసే విధానం అమలు చేస్తున్నామని చెప్పారు.

దేశంలో వస్తున్న 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో 3 కారిడార్లు ఏపీలోనే నిర్మాణం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 6 పోర్టులు ఉన్నాయని, మరో 4 పోర్టుల్ని కూడా నిర్మిస్తామని సీఎం జగన్ వెల్లడించారు.

“విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. మీ అందరినీ విశాఖకు రావాలని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కు విశాఖ రాజధాని అవుతోంది. నేను కూడా మరి కొన్ని నెలల్లో విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను. మీ అందరినీ విశాఖలో కలవాలని కోరుకుంటున్నాను” అని వివరించారు.

విశాఖే రాజధాని అన్న సీఎం జగన్… సీజేఐకి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు!

ఏపీ రాజధాని విశాఖేనని, త్వరలోనే తాను విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నానని సీఎం జగన్ ఇవాళ ఢిల్లీలో పేర్కొనడం తెలిసిందే. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు. సుప్రీంకోర్టులో ఏపీ రాజధానికి సంబంధించిన అంశం విచారణకు వచ్చే సమయంలో సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేసినట్టుందని రఘురామ తెలిపారు. నియమావళి ప్రకారం దీన్ని కోర్టు ధిక్కరణగానే భావించాలని తెలిపారు. ఏపీ సీఎం వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విధంగానే ఉన్నాయని ఆరోపించారు. విశాఖ రాజధాని అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

GVL reacts on CM Jagan comments over AP Capital

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. సుప్రీంకోర్టును అవమానించేలా జగన్ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఏపీ సీఎం రాజకీయ కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని వివరించారు. సమష్టి నిర్ణయంతో అమరావతిని రాజధానిగా తీర్మానించారని వెల్లడించారు.

ఐటీ హబ్ గా విశాఖకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును స్వాగతిస్తున్నామని జీవీఎల్ తెలిపారు. ఇక, బీఆర్ఎస్ అంటే వైసీపీకి భయమా, స్నేహమా? బీఆర్ఎస్ తో లాలూచీనా? రాజకీయ మైత్రి కొనసాగిస్తున్నారా? అని ప్రశ్నించారు.

Related posts

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట…

Drukpadam

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్!

Drukpadam

ప్రధాని ఏరియల్ సర్వే పై శివసేన, బీజేపీ మధ్య మాటల యుద్ధం!

Drukpadam

Leave a Comment