Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తల మనోవేదన సమావేశం!

ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తల మనోవేదన సమావేశం!
-పార్టీ కార్యకర్తల పరిరక్షణ సమితి పేరుతో పిలుపు
-రేణుక చౌదరి అనుయాయులు మాత్రమే హాజరు
-తమకు పార్టీలో అన్యాయం జరుగుతుందని ఆవేదన
-భట్టి టార్గెట్ గా సమావేశం జరిగిందనే అభిప్రాయాలు
-ఎన్నికల వేళ ఖమ్మం కాంగ్రెస్ లో కుంపట్లుపై కార్యకర్తల్లో ఆందోళన
-హాజరైన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎడవల్లి కృష్ణ
-కట్ల రంగారావు ,మిక్కిలినేని నరేంద్ర , ముస్తఫా ,నున్న రామకృష్ణ , పగడాల -మంజుల,డాక్టర్ శంకర్ నాయక్ హాజరు
-కాంగ్రెస్ కుంపట్లపై అధికారపార్టీ నిశిత పరిశీలన

అసలే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ప్రచారం జరుగుతున్న వేళ కార్యకర్తల పరిరక్షణ పేరుతో రేణుక వర్గీయులు ఖమ్మంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు . ఈసమావేశంలో కార్యకర్తలు తమకు జరుగుతున్న అన్యాయాలపై మనోవేదన వ్యక్తం చేశారు .పనిలోపనిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పై పరోక్ష విమర్శలు గుప్పించారు .కొందరు దీనికి అభ్యంతరం చెప్పినట్లు సమాచారం . రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసిన సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల్లో హాథ్ సే హాథ్ జోడో పేరుతో యాత్రలు ..భద్రాచలంనుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేయనున్న దృష్ట్యా దాన్ని జయప్రదం చేయాలనీ సమావేశం తీర్మానించింది .

దీనికి కేవలం రేణుక వర్గీయులే హాజరు కావడం గమనార్హం .జిల్లా అధ్యక్షుడు ఇతర నాయకులు , హాహారు కాలేదు . దీంతో అక్కడికి వచ్చిన కొందరు పార్టీ పదవులపై ప్రశ్నించారు .దీంతో వారికీ సర్ది చెప్పేందుకు వచ్చిన నాయకులు తంటాలు పడ్డారు . ఒకవేళ భట్టి వల్లనే పదవులు రాలేదనే చెప్పేందుకు ఆధారాలు లేవు . పైగా భట్టికి కనీసం తెలియకుండానే రాష్ట్రంలో సీనియర్లను పట్టించుకోకుండా పదవులు ఇచ్చారనే తిరుగుబాటు జరిగింది. దీంతో జోక్యం చేసుకున్న ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జిగా ఉన్న మాణిక్యం ఠాకూర్ ను మార్చారు . మహారాష్ట్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మాణిక్ రావు థాకరే ను నియమించారు . ఆయన ఇప్పటికే రెండు మూడు సార్లు పర్యటించి నాయకుల మధ్య ఐక్యతకు కొంత కృషి చేశారు . ఇక జిల్లాల్లో ఎవరి కుంపటివారిదిగానే ఉంది .అధికార బీఆర్ యస్ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తుంది .

ఇంకా సమావేశంలో కొరివి వెంకటరత్నం, గాదె చెన్న కేశవలు , భూక్యా దళ్ సింగ్ , లక్కినేని సురేందర్ , రావూరి వెంకటరమయ్య , పెట్టేటి నరసింహారావు , గురజాల గోపి, పోరెడ్ల విజయలక్ష్మి, డి వెంకట్రాం నాయక్, సంపెట నరసింహారావు, పాపానాయక్, దామాల రాజు, కన్నీటి వెంకన్న, నాగండ్ల శ్రీనివాసరావు, నరాల నరేష్ దేవుళ్ళ కృష్ణయ్య, పున్నం రాజశేఖర్, బద్ది కిషోర్, లక్కిరెడ్డి గోపిరెడ్డి, కనకం మైసయ్య, రఘురాం రెడ్డి, బానోతు బద్రి నాయక్, తలారి చంద్రప్రకాష్ , మానుకోట ప్రసాద్ , పైడిపల్లి రవి, దార్ల సురేష్ , కాలినేని సత్యనారాయణ, రావి నాగేశ్వరరావు, ఏడుకొండలు, వైయస్ రావు,తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. చేసి చూపిస్తా: వైయస్ షర్మిల అభ్యర్థన !

Drukpadam

స్పీడు పెంచిన కాసాని.. తెలంగాణ టీడీపీకి కొత్త కార్యవర్గం …

Drukpadam

జగన్ పై తనకు పూర్తీ విశ్వాసం …ఏ పని అప్పగించిన చేస్తా :సినీ నటుడు అలీ!

Drukpadam

Leave a Comment