Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆదర్శంలో కమ్యూనిస్టులకు సాటి మరెవరు లేరు …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు!

ఆదర్శంలో కమ్యూనిస్టులకు సాటి మరెవరు లేరు …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు!
-అందరికి సమాన అవకాశాలు కావాలనేది కమ్యూనిస్టులే
-బిజెపి కంటే సిపిఐ కే బలం ఉంది
-మనిషికి ప్రశ్నించడం నేర్పింది కమ్యూనిస్టులే
-దేశంలో మతతత్వం ,విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఓడించాలి
-రాష్ట్రంలో కార్మికుల ,కర్షకుల హక్కులకోసం పోరాటాలు

ఆదర్శంలో కమ్యూనిస్టులకు మించినవారు ఎవరు లేరని ,సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు .గురువారం వనపర్తిలో జరిగిన సిపిఐ నేత చంద్రయ్య సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు . బీజేపీ కన్న సిపిఐ బలంగా ఉన్న విషయాన్నీ ఈ సందర్భంగా కూనంనేని ప్రస్తావించారు .
ముందుగా కామ్రేడ్ డి. చంద్రయ్య చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. పార్టీ త్యాగాలను ,కమ్యూనిస్టుల చరిత్రను ఆయన గుర్తుచేశారు .నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ప్రస్తావించారు . విలువల్లో కమ్యూనిస్టుల గోటికి ఎవరు సాటిరారని అన్నారు . గొంతులోని వారి పక్షాన ప్రశ్నించేది కమ్యూనిస్టులే అన్నారు. ప్రజలకు ప్రశ్నించడం కమ్యూనిస్టులు నేర్పుతారని కష్టజీవులకు అండగా ఉంటారని అన్నారు . కార్మికులకు ,కర్షకులకు అండగా పార్టీ నిరంతరం చేస్తున్న ఉద్యమాలను ఆయన ప్రస్తావించారు .దేశంలో బీజేపీ మతతత్వ ,విభజన రాజకీయాలను ఓడించాలని అందుకు సిపిఐ బలాన్ని ,బలగాన్ని ఉపయోగిస్తుందని పేర్కొన్నారు . పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాల ద్వారానే ప్రజల చైతన్యం చేస్తూ పార్టీని అభివృద్ధిని చేస్తామని చెప్పారు . పేదలకు ఇళ్ల స్థలాలు ఇంటికి ఐదు లక్షల సహాయం కోసం రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పోరాడుతోందన్నారు. తమపై 123 (బి )కఠిన సెక్షన్లతో కేసులు చేశారన్నారు. అయిన రాజీలేదన్నారు. మతోన్మాద బిజెపిని అడ్డుకోవటమే ధ్యేయమన్నారు. భరోసా కోసం రాజకీయ త్యాగం చేయమన్నారు. ఇళ్ల స్థలాలు 5 లక్షల సహాయం పై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలన్నారు. పోడు భూముల పట్టాల కోసం సిపిఐ ఎప్పటినుంచే పోరుతుందని అన్నారు . ఈ సభకు సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు అధ్యక్షత వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ సిపిఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా కార్యదర్శి అరుణ్ కుమార్ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు చెన్న రాములు డాక్టర్ మురళీధర్ మాట్లాడారు. సిపిఐ గద్వాల జిల్లా సెక్రెటరీ ఆంజనేయులు మహబూబ్నగర్ జిల్లాకార్యదర్శి బాలకిషన్ నారాయణపేట జిల్లా కార్యదర్శి, డి చంద్రయ్య సతీమణి బాలమ్మ,సిపిఐ పట్టణ కార్యదర్శి, రమేష్ తదితరులు వేదిక అలంకరించారు.

Related posts

హుజురాబాద్ ఆపరేషన్ నేరుగా రంగంలోకి దిగిన హరీష్ రావు!

Drukpadam

ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టపరిచి ప్రజల ప్రాణాలను కాపాడాలి:పి వై ఎల్ -పి ఓ డబ్ల్యు

Drukpadam

కేసీఆర్ అనే రావణాసురుడిని నుంచి విముక్తి లభించింది … తన సస్పెండ్ పై తీవ్రంగా స్పందినచిన పొంగులేటి…

Drukpadam

Leave a Comment