Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

వ్యాక్సిన్ సేకరణకు అనుమతించండి: ప్రధాని మోదీకి మహారాష్ట్ర సీఎం విజ్ఞప్తి

వ్యాక్సిన్ సేకరణకు అనుమతించండి: ప్రధాని మోదీకి మహారాష్ట్ర సీఎం విజ్ఞప్తి
-దేశంలో కరోనా వ్యాక్సిన్లకు కటకట: ఇతర సంస్థలనుంచి సేకరణకు ప్రయత్నం
-వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తిలో భారత్ బయోటెక్, సీరం ముమ్మరం
-రాష్ట్రాల్లో ముందుకు కదలని వ్యాక్సినేషన్
-అనుమతిస్తే ఒక్కసారే వ్యాక్సిన్లు కొనుగోలు చేస్తామని వెల్లడి
-ప్రధానికి లేఖ రాసిన ఉద్ధవ్ థాకరే
-మిగతా రాష్ట్రాలలో ప్రరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.
-మహారాష్ట్ర బాటలో అనేక రాష్ట్రాలు
-కేంద్ర నిర్ణయం కోసం ఎదురు చూపులు

దేశంలో 4 లక్షలకు పైగా రోజువారీ కరోనా కేసులు వస్తుండగా, 4 వేలమందికి పైగా చనిపోతున్నారు.దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా ను అరికట్టాలంటే వ్యాక్సిన్ అంట త్వరగా జరిగితే అంత ఉపయోగమని వివిధ దేశాలలో జరిగిన వ్యాక్సిన్ ప్రక్రియ తెలియజేస్తుంది.దేశ జనాభా 138 కోట్లు కావలసిన టీకాలు రెండు డోసుల చొప్పున 280 కోట్లు అవసరం . మాదగ్గర ఉత్పత్తి చేస్తున్న కంపెనీ లు సంవత్సర కాలంలో మాత్రమే ఉత్పత్తి చేయగలవు అందువల్ల పెద్దమొత్తంలో వ్యాక్సిన్లు కావాలంటే ఇతర సంస్థలను ప్రోత్స వించాల్సిందే అప్పుడు మాత్రమే వ్యాక్సిన్లకు తీవ్రమైన కొరత తీరుతుంది. తొలి డోసు తీసుకున్న చాలామందికి ఇంకా రెండో డోసు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. భారత్ లో ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను వినియోగిస్తున్నారు. కొవాగ్జిన్ ను భారత్ బయోటెక్, కొవిషీల్డ్ ను సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ దేశీయ అవసరాలు తీరడంలేదు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇతర సంస్థల నుంచి కరోనా వ్యాక్సిన్లు సేకరించేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. తమ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొరత అధికంగా ఉందని, వీలైతే రాష్ట్ర ప్రజలందరికి సరిపోయేలా ఒక్కసారే వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని థాకరే వెల్లడించారు.

కానీ దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల వద్ద తగినన్ని నిల్వలు లేవని, ఈ నేపథ్యంలో ఇతర ఉత్పత్తిదారుల నుంచి వ్యాక్సిన్ కొనుగోళ్లకు రాష్ట్రాలను అనుమతిస్తే స్వల్పకాలంలోనే అధిక సంఖ్యలో జనాభాకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు వీలవుతుందని వివరించారు. తద్వారా కరోనా థర్డ్ వేవ్ ను కూడా అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది .రాష్ట్రాలలో డిమాండ్ తగ్గట్లు ఉత్పత్తి లేదు . రాష్ట్రాలలో వ్యాక్సిన్ కోసం ప్రజలు క్యూకడుతున్నారు .మొదటి డోస్ ఇచ్చినవారికి రెండవ డోస్ 21 రోజులలో ఇవ్వాల్సి ఉంది కాని ఇవ్వలేదు . దీనిపై ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర సంస్థల నుంచి తెచ్చుకునేందుకు కేంద్ర అనుమతి ఇస్తే అనేక రాష్ట్రాలు అదే బాటలో పయనించే అవకాశం ఉంది. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

Related posts

బెంబెలెత్తిస్తున్న కరోనా కేసులు… రేపటి నుంచి బెంగాల్ లో విద్యాసంస్థల మూసివేత!

Drukpadam

అవసరమున్నవే తెరవాలి..లేదంటే మూడో వేవ్​ ముప్పు: సీఐఐ అధ్యక్షుడు టి.వి. నరేంద్రన్…

Drukpadam

6 కోట్ల అస్ట్రాజెనికా టీకా డోస్ లను అందించనున్నాం : వైట్ హౌస్

Drukpadam

Leave a Comment