Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేజ్రీవాల్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే… సీఎల్పీ నేత భట్టి!

కేజ్రీవాల్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే… సీఎల్పీ నేత భట్టి

సమాజ మార్పు కోరేవారి ఆలోచనలకు వెన్నుపోటు పొడిచిన కేజ్రీవాల్

అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానని అవినీతిలో కూరుకుపోవడం ప్రజలను మోసం చేయడమే

మీడియా సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

లిక్కర్ అవినీతి కేసులో కూరుకుపోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ తోపాటు ఆ కేసులో ఉన్న అందరిపైన చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘అవినీతికి వ్యతిరేకంగా సమాజంతో పాటు ప్రభుత్వ నిర్మాణం చేస్తానని చెప్పిన కేజ్రీవాల్ దేశంలో ఉన్నటువంటి ఆనేక మంది యువతి యువకులను, ముఖ్యంగా గాంధేయవాదులను మోసం చేశాడని మండిపడ్డారు.
అవినీతి లేని సమాజ నిర్మాణం చేస్తానని చెప్పిన కేజ్రీవాల్ మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఇంత మందిని మోసం చేసి అవినీతిలో మునిగి తేలితే ఇంత కంటే ప్రమాదకరమైన విషయం ఇంకొకటి ఉండదని” తాను భావిస్తున్నానని అన్నారు. దేశ మార్పుకు ఆలోచన చేసే అనేక మంది ఆలోచనలకు వెన్ను పోటు పొడిచిన వ్యక్తిగా కేజ్రీవాల్ ను చూడాల్సి వస్తుందన్నారు. దేశానికి, సమాజానికి సమాధానం చెప్పాల్సిన భాధ్యత కేజ్రీవాల్ పై ఉన్నదని అన్నారు. లిక్కర్ అవినీతిలో కూరుకుపోయిన కేజ్రీవాల్ పైన చట్ట పరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసులో మన రాష్ట్రం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కవిత, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొంత మంది పేర్లు వినిపిస్తున్నందున వారే కాకుండా, ఎంతటి వారు ఉన్న ప్రభుత్వం ఉపేక్షించకుండ చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కోన్నారు. దేశం మొత్తం మీద అవినీతిలేని సమాజం నిర్మించడానికి కొంత మంది యువత చేస్తున్న ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్తానని చెప్పి అన్న హాజరే లాంటి వారు స్పూర్తి అని ప్రచారం చేసుకొని ప్రజల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ లిక్కర్ అవినీతి కేసులో కూరుకుపోవడం ప్రజలను మోసం చేయడమేనని, ఇది పచ్చి దగా కాబట్టి ఇటువంటి వారిని వెంటనే ఆరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు.

Related posts

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును ధ్రువీకరించిన సీఐడీ…

Drukpadam

నారా లోకేష్ పై మంత్రి కన్నబాబు సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

రాష్ట్రానికి పనికిమాలిన ప్రతిపక్షం అవసరమా?: మంత్రి బొత్స

Drukpadam

Leave a Comment