Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఖమ్మం జిల్లాలో వందేభారత్ రైలుపై దాడి… మూడు గంటల ఆలస్యం!

ఖమ్మం జిల్లాలో వందేభారత్ రైలుపై దాడి… మూడు గంటల ఆలస్యం!

  • ఇటీవల సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు ప్రారంభం
  • నేడు విశాఖ నుంచి వస్తుండగా రాళ్ల దాడి
  • దెబ్బతిన్న ఎమర్జెన్సీ విండో
  • సీసీటీవీ కెమెరాల ద్వారా రాళ్లు విసిరిన వ్యక్తుల గుర్తింపు

ఇటీవల సికింద్రాబాద్-విశాఖ నగరాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సెమీ హైస్పీడ్ రైలుకు వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం జరిపారు. కాగా, ఈ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఈసారి ఖమ్మం జిల్లాలో దీనిపై దాడి జరిగింది. 

ఇటీవల ప్రారంభోత్సవానికి ముందు వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ కోసం విశాఖ చేరుకుంది. అయితే, కంచరాపాలెం వద్ద కొందరు వ్యక్తులు రాళ్లు విసరడంతో రెండు బోగీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. 

తాజాగా, ఖమ్మం జిల్లాలో ఈ రైలుపై రాళ్ల దాడి జరిగింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఓ బోగీకి చెందిన ఎమర్జెన్సీ విండో దెబ్బతినడంతో, ఆ విండో మార్చారు. రాళ్ల దాడి నేపథ్యంలో, వందేభారత్ రైలు మూడు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకుంది. కాగా, సీసీటీవీ కెమెరాల ద్వారా రాళ్లు విసిరిన వ్యక్తులను గుర్తించినట్టు తెలుస్తోంది.

Related posts

మగువతో మగవారికి ట్రాప్.. ముఠా గుట్టు రట్టు

Ram Narayana

సంచలన ఆరోపణలతో జైలు నుంచి మరో లేఖ విడుదల చేసిన సుఖేశ్ చంద్రశేఖర్…

Drukpadam

అన్న భార్యపై కవల సోదరుడి అఘాయిత్యం.. భర్తనని నమ్మించి నెలల తరబడి అత్యాచారం!

Drukpadam

Leave a Comment