Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

పొరపాటున పేలిన తుపాకీ… అమెరికాలో ఖమ్మం జిల్లా యువకుడి మృతి!

పొరపాటున పేలిన తుపాకీ… అమెరికాలో ఖమ్మం జిల్లా యువకుడి మృతి!

  • ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లిన అఖిల్ సాయి
  • ఓ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ ఉద్యోగం
  • సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న తుపాకీని పరిశీలిస్తుండగా మిస్ ఫైర్
  • తలలోంచి దూసుకెళ్లిన బుల్లెట్
  • అఖిల్ సాయి స్వస్థలం ఖమ్మం జిల్లా మధిర

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో తుపాకీ మిస్ ఫైర్ కారణంగా మృతి చెందిన ఘటన వెల్లడైంది. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్ సాయి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏడాది కిందట అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. కాగా, ఖర్చుల కోసం ఓ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే, అక్కడి సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న తుపాకీని పరిశీలిస్తుండగా, అది పొరపాటున పేలింది. అత్యంత సమీపం నుంచి తుపాకీ పేలడంతో, బుల్లెట్ అఖిల్ సాయి తలను ఛిద్రం చేసింది.

గ్యాస్ స్టేషన్ సిబ్బంది అఖిల్ సాయిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మరణించాడు. అఖిల్ సాయి మరణంతో మధిరలోని అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాన్ని భారత్ రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Related posts

కోర్ట్ ను ఆశ్రయించిన భార్య బాధితుడు ….భద్రతా కల్పించాలని ఆదేశం

Drukpadam

అమెరికాలో విషాదం.. భారత సంతతి సంపన్న కుటుంబం ఆత్మహత్య?

Ram Narayana

చిట్ ఫండ్స్ పేరుతో మోసం.. 250 ఏళ్ల జైలు శిక్ష!

Drukpadam

Leave a Comment