Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఢీ అంటే ఢీ …పొంగులేటి వర్సెస్ బీఆర్ యస్…

ఢీ అంటే ఢీపొంగులేటి వర్సెస్ బీఆర్ యస్
పొంగులేటి ఖమ్మం జిల్లాలో నీ ఆటలు సాగనివ్వం
నీకు దమ్ముంటే పార్టీకి రాజీనామా చెయ్యి
డిసెంబర్ 31 వరకు గొప్పదైన పార్టీ జనవరి 1 నుంచి మారిందా ?
సీఎం కేసీఆర్ పై ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తే సహించం
పార్టీ బీ ఫారం పొంది పార్టీకి వ్యతిరేకంగా వ్యవరిస్తే చర్యలు తప్పవు
వ్యక్తికన్నా పార్టీ గొప్పదిగీతదాటితే ఎంతటివారినైనా వదిలిపెట్టం
ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షత వైరా లో బీఆర్ యస్ ముఖ్యనేతల సమావేశం
పొంగులేటి విచ్చిన్నకర విధానాలపై ధ్వజమెత్తిన మంత్రి అజయ్ , ఎమ్మెల్సీ జిల్లా టీఆర్ యస్ అధ్యక్షులు తాతా మధు

 

ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ ….పొంగులేటి మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఏర్పడింది . ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు . వైరాలో జరిగిన సభలో మంత్రి అజయ్ పొంగులేటి చర్యలపై తీవ్రస్థాయిలో ద్వజామెత్తారు . పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నీ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు బీఆర్ యస్ పార్టీకి అడ్డు వస్తే ప్రవాహంలో కొట్టుకొని పోవడం ఖాయమన్నారు .వ్యక్తికన్నా పార్టీ గొప్పది నేనే గొప్ప అనుకున్నవాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వల్ల అధికారాలు అనుభవించి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు . డిసెంబర్ 31 వరకు బీఆర్ యస్ ఓహో ఆహ అని కేసీఆర్ విధానాలు మెచ్చుకొన్న పొంగులేటి జనవరి 1 నుంచి కేసీఆర్, బీఆర్ యస్ పార్టీ పనికి రాకుండా పోయిందా ? అని ప్రశ్నించారు .పార్టీనుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకొని పార్టీపై నిందలు వేసి సస్పెన్షన్ చేస్తే సింపతీ పొందాలని చూస్తున్న పొంగులేటి చర్యలను ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని అన్నారు .ఇలాంటి వారిని పట్టించుకోవద్దని స్వయంగా సీఎం చెప్పిన విషయాన్నీ ప్రస్తావించారు . పార్టీఅనేది ఒక మహాసముద్రం పొంగులేటి అనేవాడు వ్యక్తితానే అంతా అనుకుంటే అహంకారం అవుతుంది. డబ్బుతో ఏదైనా కొనవచ్చునేమోగాని ప్రజల ప్రేమను కొనలేరని పువ్వాడ స్పష్టం చేశారు . ఖమ్మం జిల్లా ప్రజలు చాల విజ్ఞులు ఎవరిని ఎలా ఉంచాలో తెలిసిన చెతన్యం కలిగినవారు . అహంకారంతో వ్యవరించిన వారికీ ఎలా బుద్ది చెప్పాలో తెలుసునని పేర్కొన్నారు .

శ్రీనివాస్ రెడ్డి దూరం అవ్వడంతో పార్టీ కార్యకర్తల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు పార్టీ రంగంలోకి దిగింది . దీంతో ఒకపక్క పొంగులేటి ఉమ్మడిజిల్లాలో తన పర్యటనల జోరు పెంచగా అదే విధంగా పొంగులేటి వల్ల పార్టీ డామేజే కాకుండా నేతలు నడుం బిగించారు . ప్రత్యేకంగా వైరా నియోజకవర్గంలో ఎక్కువమంది స్థానిక సంస్థల ప్రతినిధులు పొంగులేటి వెంట నడుస్తుండటం మరికొంత మంది వెళతారని జరుగుతున్నా ప్రచారం నేపథ్యంలో అడ్డుకట్ట వేసే చర్యలకు ఉపక్రమించారు . మంగళవారం జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్సీ జిల్లా టీఆర్ యస్ అధ్యక్షులు తాతా మధు లు పర్యటించారు . వైరాలో స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షత జరిగిన సమావేశంలో వారు పాల్గొని పొంగులేటి పార్టీ వ్యతిరేక చర్యలను దుయ్యబట్టారు . కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు .

ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ పార్టీ కంటే ఎవరు గొప్పకాదని శ్రీనివాస్ రెడ్డి సీఎం కేసీఆర్ పై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు . శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం తల్లి పాలు తగి రొమ్ము గుద్దిన చందంగా ఉందని మండిపడ్డారు . ఆయనకు అన్ని విధాలుగా అండదండలు ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడవడం ఆయన పతనానికి నాంది అవుతుందని హెచ్చరించారు .గీతదాటితే ఎవరిని వదిలి పెట్టమని , పార్టీ ఇచ్చిన బీ ఫారం పై ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీ వ్యతిరేతి కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని అన్నారు .

ఈసమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , డీసీఎంస్ చైర్మన్ రాయల శేషగిరి రావు ,మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పన్ను’పోటుతో వేధించడం మీకు పైశాచిక ఆనందమా?: రేవంత్ రెడ్డి

Drukpadam

త్వరలోనే జియో ఎయిర్ ఫైబర్.. వేగవంతమైన 5జీ సేవలు,,!

Drukpadam

సీఎం నిర్ణయానికి ఎంపీ రఘురామ మద్దతు… కేంద్రమంత్రికి లేఖ…

Drukpadam

Leave a Comment