Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సూరులో పాము దూరిందని ఇల్లు తగల బెట్టుకున్న చందంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు …

సూరులో పాము దూరిందని ఇల్లు తగల బెట్టుకున్న చందంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు …
ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చి వేయాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సమర్ధనీయమేనా …?
కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకోని రమ్మని పిలుపు ఇవ్వడంలో తప్పులేదు
ఎలాంటి వ్యాఖ్యలవల్ల పార్టీ ప్రజల్లో మరింత పలచబడి పోతుంది.
నీకు శత్రువు కేసీఆర్ గాని ప్రగతి భవన్ కాదు
ఎవరు అధికారంలోకి వచ్చిన ఆ భవనం ఉపయోగపడుతుంది

రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు …ఫైర్ బ్రాండ్ గా పేరుంది … ఫైటర్ గా గుర్తింపు ఉంది . అందుకే రాష్ట్ర కాంగ్రెస్ లో ఎంత వ్యతిరేకత వచ్చిన ఏఐసీసీ పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది….ఆయన రాహుల్ గాంధీ భారత్ జోడో సందేశాన్ని ఊరూరా తీసుకొనే పోయేందుకు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా జరిగిన సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు . ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సమ్మక్క ,సారలమ్మ ల గద్దెల దగ్గర నుంచి పాదయాత్ర చేపట్టారు . అంతవరకూ బాగానే ఉంది …కానీ ఉన్నట్లుండి ప్రగతి భవన్ ను పేల్చేయాలని నక్సలైట్లకు పిలుపు నిచ్చారు . ఇలాంటి మాటలు ఒక భాద్యత కలిగిన రాజకీయ నేత అందునా ఒక ప్రధానమైన జాతీయపార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి నుంచి రావడం నిజంగా భాదాకరమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయాలు ఎలాంటివి పనిరావని తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రజలను మెప్పించి ఒప్పించలే కానీ పేల్చేయండని , అందునా నిషేదిత నక్సలైట్లకు పిలుపు ఇవ్వడం క్రిమినల్ చర్య కిందకే వస్తుందనే అంటారన్నారు పరిశీలకులు . పైగా ప్రగతి భవనలో ఉండేవాళ్ళు ఎవరు తెలంగాణ పదం ఉచ్చరించడానికి కూడా ఇష్టపడలేదని అలాంటివారికి అది నేడు కేంద్రంగా మారిందని తన అసహనాన్ని ఆయన వ్యక్తం చేశారు . పైగా తాను అన్నమాట సమర్థించుకునే ప్రయత్నం చేశారు . 

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ వాదులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇలాంటి మాటల వల్ల ప్రజల్లో పార్టీ బలపడం సంగతి ఆలా ఉంచితే బలహీనపడటం ఖాయమని అంటున్నారు కొందరు . నీకు శత్రువు కేసీఆర్ గాని ప్రగతి భవన్ కాదుకదా ? ఎందుకు తొందరపడి మాటలు అంటావనే అభిప్రాయాలే వస్తున్నాయి. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొనిరావాలని అందుకు ప్రజల సహకారం కోరడంలో తప్పులేదు . కానీ కేసీఆర్ మీద ఉన్న కోపంతో సూరులో పాముదూరిందని ఇల్లు తగల బెట్టుకున్న సమ్మగా ఉండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కోవర్ట్ ఆపరేషన్లలో ఎర్రబెల్లి ఎక్స్ పర్ట్: రేవంత్ రెడ్డి!

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంచి వ్యక్తి అని… ఆయన కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 2024 జనవరి మొదటి వారంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి సంతకం పోడు భూముల సమస్య పరిష్కారం పైనే ఉంటుందని చెప్పారు. భూతంలాంటి కేసీఆర్ ను పట్టి సీసాలో బంధించాలని అన్నారు. లేకపోతే కేసీఆర్ ను తట్టుకోలేమని… కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు ప్రవేశంలేనప్పుడు ప్రగతి భవన్ ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన వారికే ప్రగతి భవన్ లోకి అనుమతి ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ప్రగతి భవన్ లో పంచభక్ష్య పరమాన్నాలు పెడుతున్నారని దుయ్యబట్టారు.

కోవర్ట్ ఆపరేషన్లలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఎక్స్ పర్ట్ అని ఎద్దేవా చేశారు.ఎ, బి, సి డి లు రాని ఎర్రబెల్లి దయాకర్ లాంటివారు అందులో ఉన్నారని పేర్కొన్నారు . ఆయన కు తెలిసిన విద్య ఇక్కటే కోవర్టులు పెట్టడం అని అన్నారు . తలసాని , ,మల్లారెడ్డి లాంటివారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు . రాష్ట్రంలో 3 వేల లిక్కర్ షాపులు, 60 వేల బెల్టు షాపులు ఉన్నాయని… ప్రజలను తాగుబోతులుగా చేశారని మండిపడ్డారు. రుణమాఫీ చేయకపోవడంతో… రైతులు అప్పులపాలయ్యారని చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, దయాకర్ రావు వంటి తెలంగాణ వ్యతిరేకులకు కేసీఆర్ మంత్రి పదవులను ఇచ్చారని… మంత్రుల్లో 90 శాతం మంది తెలంగాణ వ్యతిరేకులేనని విమర్శించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంచి వ్యక్తి అని… ఆయన కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు.

Related posts

తెలంగాణలో ఉండేది సీఎం కేసీఆర్‌ ఒక్కరే :మంత్రి కేటీఆర్‌!

Drukpadam

యూపీ లో బీజేపీకి దెబ్బమీద దెబ్బ …కలవరపడుతున్న అధిష్టానం!

Drukpadam

పొంగులేటికి మంత్రి పువ్వాడ కౌంటర్ …

Drukpadam

Leave a Comment