Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ మాత్రమే!: కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి స్పష్టీకరణ…

అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ మాత్రమే!: కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి స్పష్టీకరణ…

  • ఏపీ రాజకీయాల్లో దుమారం  రేపిన ఫోన్ ట్యాపింగ్
  • తనది ఆండ్రాయిడ్ ఫోన్ అని చెప్పిన రామశివారెడ్డి
  • అది ఫోన్ లో యాదృచ్చికంగా రికార్డ్ అయిందని వివరణ 
  • రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడడం ఇష్టం లేకే నిజం చెపుతున్నానని వెల్లడి 

తన ఫోన్ ను ట్యాప్ చేశారంటూ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన మిత్రుడు రామశివారెడ్డికి చేసిన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆయన మీడియా ముఖంగా ఆధారాలను కూడా చూపించారు. ఈ నేపథ్యంలో రామశివారెడ్డి స్పందించారు. 

తన వెనుక ఎవరూ లేరని, రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడడం ఇష్టం లేకే స్వయంగా ముందుకు వచ్చి నిజం చెపుతున్నానని అన్నారు. కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ కాలేదని… కాల్ రికార్డ్ మాత్రమే అయిందని చెప్పారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్ కు సంబంధించి ఇద్దరం ఫోన్ ద్వారా మాట్లాడుకున్నామని… అది ఫోన్ లో యాదృచ్చికంగా రికార్డ్ అయిందని తెలిపారు. దీనిపై కావాలంటే కేంద్ర హోంశాఖకు, సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పారు. తనది ఐఫోన్ కాదని, ఆండ్రాయిడ్ ఫోన్ అని తెలిపారు. తాను ఎవరో సీఎం జగన్ కు తెలియదని చెప్పారు. వైఎస్ కుటుంబంపై తనకు విశ్వాసం ఉందని తెలిపారు. 

Related posts

ఉద్ధవ్ థాకరే సంచలన నిర్ణయం …ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము కు మద్దతు!

Drukpadam

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు డిజిటల్ ప్రచారం చేసుకోవాలన్న ఎన్నికల సంఘం… స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ!

Drukpadam

ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్విత ప్రాతిపదికన ఇల్లు నిర్మించి ఇవ్వాలి …సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే సీతక్క వినతి…

Drukpadam

Leave a Comment