Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటిది రైట్ పాత్ నా …? రాంగ్ పాత్ నా …?

పొంగులేటిది రైట్ పాత్ నా …? రాంగ్ పాత్ నా …?
ఆయన చేరే పార్టీ పై క్లారిటీతో ఉన్నారా ?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఢీకొట్టగలరా ?
ఆయన దమ్ము ,దైర్యం ఏమిటి …? గాడ్ ఫాదర్ ఎవరు …?
ఆయనది తలబిరుసా?….తెంపరితనమా ?
ఆయన రూటు తన అనుయాయిలు,అభిమానులు మెచ్చేదిగా ఉంటుందా …?
ఏపార్టీ అనేది చెప్పకుండానే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై సందేహాలు 
పొంగులేటి రాజకీయ అడుగులపై రాజకీయవర్గాల్లో ఆసక్తి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు …. అందుకు కారణం లేకపోలేదు …2014 లో వైసీపీ ఎంపీగా గెలిచిన ఆయన అనంతర రాజకీయ పరిణామాల్లో అధికార టీఆర్ యస్ లో చేరారు . రాజకీయాల్లో కొత్త అయినప్పటికీ తొందరలోనే ప్రజాభిమానం పొందగలిగారు . నలుగురికి సహాయపడటం పలకరింపులతో ప్రజలకు దగ్గరై , తన బ్రాండ్ ఇమేజ్ సంపాందించగలిగారు . గులాబీ పార్టీలో ఉంటూనే తన సొంతవర్గాన్ని తయారు చేసుకున్నారు . 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఇష్టం లేని పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమైయ్యారని అపవాదును మూటగట్టుకున్నారు . దీంతో సీఎం కేసీఆర్ కు ఎంపీ పొంగులేటి మధ్య గ్యాప్ పెరిగింది. కేసీఆర్ బ్రాండ్ కాకుండా తన బ్రాండ్ పెంచుకోవడం గులాబీ బాస్ కు నచ్చలేదు . అందువల్ల ఆయనకు పార్టీలో చట్ట సభల్లో ఎలాంటి అవకాశం ఇవ్వలేదు . దీంతో పార్టీకి దూరమైయ్యారు . ఇప్పుడు ఏపార్టీలో చేరతారనేది చెప్పలేదు . బీజేపీ , కాంగ్రెస్ , వైయస్సార్ టీపీ పార్టీలు తమ పార్టీలో చేరాలని ఆయన్ను ఆహ్వానిస్తున్నాయి. ఆయన తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటూనే నియోజకవర్గాల్లో తన మనుషులు అనుకున్నవారిని అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు . ఒప్పందం లేకపోతె ఏపార్టీ కూడా తాను ఎంపిక చేసిన అభ్యర్థులనే పోటీలో పెట్టమంటే అంగీకరించకపోవచ్చుఅయితే ఆయన వెళుతున్న దారి రైటా ..రాంగా అనేదానిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. అసలు ఆయన పార్టీలో చేరితే ఉపయోగం అని అనుయాయులు చర్చించుకుంటున్నారు . ఏపార్టీ అయినా చేరక ముందు ఉండే పలకరింపులు చేరిన తర్వాత ఉండవనేది వాస్తవంఆయన వేసే అడుగులు తెలివైనవేనా? లేదా ? అనే అభిప్రాయాలు లేకపోలేదు . ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని అనుకుంటున్నారు . అయితే జిల్లాలో ఆపార్టీకి సరైన ఆదరణ లేదు . కాంగ్రెస్ అయితే జిల్లాలో ప్రభావశీలంగా ఉంటుందని పరిశీలకుల అభిప్రాయంషర్మిల పార్టీలో చేరతారని ఆమె ప్రకటించారు . అందుకు ఆయన నేను ఎవరికీ పార్టీలో చేరతానని చెప్పలేదని తేల్చి చెప్పారు .

పొంగులేటి ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒకరకంగా షేక్ చేస్తున్నారు . ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు . ఆయన దమ్ము దైర్యం ఏమిటి? …ఆయనది తలబిరుసాతెంపరితనమాఅనే చర్చ జరుగుతుంది. జిల్లాలో శీనన్న ముద్ర ఉండాలని కోరుకుంటున్న ఆయన, తనదైన శైలిలో జిల్లా రాజకీయాలను నడుపుతున్నారు .

ఆయన వెంట ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలు కూడా తిరుగుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఉన్న 7 రిజర్వుడ్ నియోజకవర్గాలలో అభ్యర్థులను ఖరారు చేశారు .రాజకీయాల్లో ఎత్తుపల్లాలు,కుదుపులు , గెలుపులు ,ఓటములు అనేవి సహజంఎవరైనా ఎప్పడు ఒక రకంగా ఉండరు ..ఇందిరాగాంధీ , ఎన్టీఆర్ లాంటి వారు కూడా ఓటమి చెందారు .

  • రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయకపోతే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు ఉన్నాయి. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన పొంగులేటి నాడు వైయస్ చరిష్మా , జగన్ మోహన్ రెడ్డి అండదండలతో జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించిన మొనగాడిగా నిలిచారు. దీంతో జగన్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు . రాష్ట్రంలో ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకున్నారు . ఎప్పుడైతే కేటీఆర్ స్నేహం ఏర్పడి గులాబీ పార్టీలో చేరారో అప్పుడే ఢమాల్ అని కింద పడ్డారు .పార్లమెంట్ కు పరిమితమైయ్యారు . చివరకు 2019 ఎన్నికలనాటికి అదికూడా లేకుండా ఉన్న సీటును ఆయన నుంచి తీసి నామ నాగేశ్వరరావు కు ఇచ్చారు . అప్పుడు కాంగ్రెస్ ఎంపీ సీటు ఇస్తామని ఆఫర్ చేసినప్పటికి అందులోకి ఆయన వెళ్ళలేదు . అధికార పార్టీలో తనకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పారని అన్నారు .అది రాలేదు . చివరకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు . దీంతో పార్టీ అవమానాలపై ఆయన రగిలి పోతున్నారు. ఆయనకు గాని ఆయన అనుయాయులకు గాని పార్టీలో ఎలాంటి పదవులు లేవుఇక ఇందులో ఉంటె ఆత్మగౌరవం లేకుండా పోవడమే కాకుండా తనను నమ్ముకున్నవాళ్లకు సైతం అన్యాయం జరుగుతుందని భావించారు. దీంతో తన మార్గం తాను ఎంచుకునేందుకు సిద్ధపడ్డారు . తన అనుయాయులపై పార్టీ క్రమశిక్షణ పేరుతో వేటు వేయడంపై కారాలు మిరియాలు నూరుతున్నారు .తనవాళ్లను కాదు దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలనీ పొంగులేటి సవాల్ విసిరారు . దీనిపై జిల్లా మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాతా మధు కౌంటర్ ఎటాక్ చేశారు . పొంగులేటి దమ్ముంటే తానే పార్టీకి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు . దీంతో పొంగులేటి మద్దతుతో గెలిచిన ఎమ్మెల్సీ తాతా మధు , వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ లు రాజీనామా చేసి ప్రజామద్దతు కోరాలని పొంగులేటి అనుయాయుడు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ డిమాండ్ చేశారు . ప్రస్తుతం బీఆర్ యస్ వర్సెస్ పొంగులేటి వర్గంగా ఉన్న వ్యవహారం ఎన్నికల నాటికీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి ..

Related posts

మధిర భట్టి గెలుపులోఆమెదే కీలక పాత్ర…

Drukpadam

దేశం గర్వించేలా సచివాలయాన్ని నిర్మించాలి: కేసీఆర్…

Drukpadam

భట్టి పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్… ఢిల్లీలో రాహుల్ తో సమావేశం!

Drukpadam

Leave a Comment