Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ఈయూ కీలక నిర్ణయం.. ‘ఫైజర్’ వైపు మొగ్గు

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ఈయూ కీలక నిర్ణయం.. ‘ఫైజర్’ వైపు మొగ్గు
-ఫైజర్‌తో భారీ ఒప్పందం
-ఒప్పందం మేరకు టీకాలను సరఫరా చేయలేకపోతున్న ఆస్ట్రాజెనెకా
-కాంట్రాక్ట్ పునరుద్ధరించకూడదని ఈయూ నిర్ణయం

కరోనా టీకాలను సరఫరా చేస్తామంటూ యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలతో కుదర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయడంలో ఆస్ట్రాజెనెకా విఫలమైంది. చేసుకున్న ఒప్పందం మేరకు టీకాలను సరఫరా చేయలేకపోతోంది. దీంతో ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్న యూరోపియన్ యూనియన్ ఆస్ట్రాజెనెకాపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. తాజాగా, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో దానిని ఇక పునరుద్ధరించకూడదని నిర్ణయించింది.ఇప్పటికే ఆస్ట్రా జనకా టీకాల విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. అనేక దేశాలు దీనిని తిరస్కరించాయి. కొన్ని దేశాలు మాత్రమే ఆస్ట్రా జనకా వ్యాక్సిన్లు వాడుతున్నాయి.

ఈ మేరకు యూరోపియన్ ఇంటర్నల్ మార్కెట్ కమిషనర్ తెలిపారు. కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేయాలని అనుకోవడం లేదని, తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్నారు. 2023 నాటికి 1.8 బిలియన్ కోసం భారీ కాంట్రాక్ట్‌ పొడిగింపునకు అంగీకరించడం ద్వారా ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాకు మద్దతు ఇచ్చిన తర్వాతి రోజే ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఆస్ట్రాజెనెకాకు బదులుగా ఫైజర్ వ్యాక్సిన్‌ను తెప్పించుకుంటామని పేర్కొంది. ఆస్ట్రాజెనెకాతో పోలిస్తే ఫైజర్ వ్యాక్సిన్ ధర తక్కువని ఈయూ స్పష్టం చేసింది.

Related posts

ఢిల్లీలో గాలి.. వర్ష బీభత్సం దృశ్యాలు ….

Drukpadam

Tech News | This Is Everything Google Knows About You

Drukpadam

ఈజిప్ట్ ట్రావెల్ ఏజెంట్ కు షారుఖ్ ఖాన్ లేఖ!

Drukpadam

Leave a Comment